ETV Bharat / sitara

ఎన్టీఆర్ మాటలకు షాక్​లో అజయ్ దేవ్​గణ్.. ఏమన్నారంటే? - ఆర్​ఆర్ఆర్ తాజా వార్తలు

NTR On Ajay Devgan: 'ఆర్​ఆర్​ఆర్' ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం సందర్భంగా బాలీవుడ్ స్టార్​హీరో అజయ్​ దేవగణ్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ వ్యాఖ్యలకు అజయ్ దేవ్​గణ్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంతకీ ఎన్టీఆర్.. అజయ్​ దేవ్​గణ్​ను ఏమన్నారు?

NTR On Ajay Devgan
అజయ్ దేవ్​గణ్​ పై ఎన్టీఆర్
author img

By

Published : Dec 10, 2021, 10:58 PM IST

NTR On Ajay Devgan: 'ఆర్​ఆర్​ఆర్' ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం​ డిసెంబర్​ 9న ముంబయిలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకధీరుడు రాజమౌళి, జూనియర్​ ఎన్టీఆర్​, అలియా భట్, అజయ్ దేవ్​గణ్​.. పాల్గొన్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్​ హీరో అజయ్ దేవగణ్​తో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది? అన్న ప్రశ్నకు ఎన్టీఆర్​ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

అజయ్​ దేవ్​గణ్ చిత్రాలు చూస్తూ పెరిగానని, ఆయన నాకు గురువు లాంటి వారని అన్నారు. అజయ్​కు ఉన్న సినియారిటీ దృష్ట్యా.. తనతో పోల్చవద్దన్నారు. 'ఫూల్ ఆర్​ కాంటే' చిత్రంలో అజయ్ దేవ్​గణ్ ఎంట్రీ చూసి చిన్నతనంలో ఆశ్చర్యానికి గురయ్యానన్నారు. ఇప్పటికీ షాక్​ గానే ఉంటుందన్నారు. ఎన్టీఆర్​ సమాధానానికి.. నన్ను పెద్దవాడిని చేసినందుకు ధన్యవాదాలు అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు అజయ్ దేవగణ్​. గురువారం ఉదయం 10 గంటలకు థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్​ విడుదల చేయగా, ఆ తర్వాత కొద్దిసేపటికే యూట్యూబ్​లో పోస్ట్​ చేశారు.

అప్పటినుంచి యూట్యూబ్​లో రికార్డులమోత మోగిస్తోంది. విడుదలైన 24గంటల్లోనే అత్యధిక వ్యూస్​ సంపాదించిన భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది.

RRR Release Date: భారీ బడ్జెట్​తో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ హీరోయిన్లు. అజయ్​ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య.. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో ఈ సినిమా నిర్మించారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఇది విడుదల కానుంది.

ఇదీ చూడండి: 'ఆయనే 'ఆర్​ఆర్​ఆర్' చిత్రానికి వెన్నెముక'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.