ETV Bharat / sitara

నాన్న సినిమా రీమేక్​ చేస్తా.. కానీ ఓ కండీషన్​: ఎన్టీఆర్​ - ఎన్టీఆర్​ ఆర్​ఆర్​ఆర్​

తన తండ్రి హరికృష్ణ నటించిన ఓ సూపర్​హిట్​ సినిమాకు రీమేక్​ చేస్తానని చెప్పారు హీరో ఎన్టీఆర్​. అయితే ఓ కండీషన్​ పెట్టారు. ఇంతకీ ఆ మూవీ, షరతు ఏంటో తెలుసుకుందాం..

NTR Remake Seethiayya movie
సీతయ్య రీమేక్​ ఎన్టీఆర్
author img

By

Published : Mar 20, 2022, 4:39 PM IST

Updated : Mar 20, 2022, 5:08 PM IST

నందమూరి హరికృష్ణ నటించిన సూపర్​ హిట్​ సినిమాల్లో 'సీతయ్య' ఒకటి. ఈ చిత్రం ఎంతగా హిట్​ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తనకు అవకాశమస్తే తప్పకుండా తన తండ్రి నటించిన 'సీతయ్య' సినిమాను రీమేక్​ చేస్తానని అన్నారు హీరో ఎన్టీఆర్​. 'ఆర్​ఆర్​ఆర్'​ ప్రమోషన్స్​లో భాగంగా రామ్​చరణ్​తో కలిసి ఓ స్పెషల్​ చిట్​చాట్​లో పాల్గొన్న తారక్​ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి హోస్ట్​గా వ్యవహరించిన సంగీత దర్శకుడు కీరవాణి అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు. " సీతయ్య సినిమాకు మీరు స్వరాలు అందిస్తానంటే తప్పకుండా చేస్తాను. ముఖ్యంగా 'వినపడదు, వినలేదు, వినడు' అనే డైలాగ్​ తప్పకుండా ఉండాలి" అని తారక్​ చెప్పారు. వైవీఎస్​ చౌదరి తెరకెక్కించిన ఈ సినిమాలో సౌందర్య, సిమ్రాన్​ హీరోయిన్లుగా నటించగా.. కీరవాణి సంగీతం అందించారు.

ఈ చిట్​చాట్​ షోలో భాగంగా హరికృష్ణ 'సీతయ్య', చిరంజీవి 'ఘరాణా మొగుడు' సినిమా షూటింగ్​ నాటి సంగతుల్ని గుర్తుచేసుకున్నారు కీరవాణి. హరికృష్ణ, చిరంజీవి చాలా ఆత్మీయంగా ఉండేవారని అన్నారు. 'సీతయ్య' సినిమా తనకు ఆల్​టైం ఫేవరెట్​ మూవీ అని, అందులో 'ఒక్క మగాడు' సాంగ్​ బాగా ఇష్టమని చెప్పారు.

తారక్​ ఎన్టీఆర్​ కీరవాణి

తాను కంపోజ్​ చేసిన పాటల్లో మీకు ఏది నచ్చలేదు అని కీరవాణి అడగగా.. "భీమవరం బుల్లోడ' సాంగ్​ నాకు ఇష్టం లేదు. అది వింటే చికాకు​ వస్తుంది అని తారక్​ చెప్పారు. "ఈ పాట నాకు ఇష్టమే. 2021లో మీరు చేసిన ఓ పాట రిలీజ్ అయింది. అది నాకు నచ్చలేదు. దాని పేరు కూడా గుర్తులేదు. 'బంగారు కోడి పెట్ట' సాంగ్​ విషయానికొస్తే కొత్త వెర్షన్​​ కన్నా పాతదే ఎక్కువ ఇష్టం" అని చరణ్​ అన్నారు.

ఇదీ చూడండి: 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో తొలిసారి తెలుగు తెరపై కనిపించనున్న నటులు వీరే..!

Last Updated : Mar 20, 2022, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.