యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, నందమూరి కల్యాణ్‌రామ్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్ మిక్కిలినేని నిర్మాతగా వ్యవహరించనున్నారు.
గురువారం తారక్ పుట్టినరోజు సందర్భంగా 'ఎన్టీఆర్30' టీమ్ ఓ సరికొత్త ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఎన్టీఆర్ స్మార్ట్ లుక్‌తో ఇన్‌షర్ట్ చేసుకుని క్లాసీ, ప్రొఫెషనల్‌గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ యంగ్ టైగర్ అభిమానుల్ని ఎంతో ఆకట్టుకుంటోంది. అయితే, తారక్ తన 30వ చిత్రాన్ని మొదట త్రివిక్రమ్‌తో ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ను ప్రస్తుతానికి పక్కనపెట్టారు.
-
Wishing our Young Tiger @tarak9999 a very Happy Birthday.
— Yuvasudha Arts (@YuvasudhaArts) May 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Sending you cheer & wishing you good health ❤️#NTR30#NTRKoratalaSiva2 @sivakoratala @NTRArtsOfficial pic.twitter.com/rj2rkPO3RH
">Wishing our Young Tiger @tarak9999 a very Happy Birthday.
— Yuvasudha Arts (@YuvasudhaArts) May 19, 2021
Sending you cheer & wishing you good health ❤️#NTR30#NTRKoratalaSiva2 @sivakoratala @NTRArtsOfficial pic.twitter.com/rj2rkPO3RHWishing our Young Tiger @tarak9999 a very Happy Birthday.
— Yuvasudha Arts (@YuvasudhaArts) May 19, 2021
Sending you cheer & wishing you good health ❤️#NTR30#NTRKoratalaSiva2 @sivakoratala @NTRArtsOfficial pic.twitter.com/rj2rkPO3RH
ప్రస్తుతం ఎన్టీఆర్ 'ఆర్‌ఆర్‌ఆర్'లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆయన కొమురంభీమ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌చరణ్ మరో కథానాయకుడు. ఇందులో ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్ భామ ఒలీవియా మోరీస్ సందడి చేయనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ సినిమా పూర్తైన వెంటనే తారక్.. కొరటాల శివ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నారు. అలాగే శివ సైతం ప్రస్తుతం 'ఆచార్య'తో బిజీగా ఉన్నారు.