ETV Bharat / sitara

'షూటింగ్​లో ఎన్టీఆర్​కు గాయం.. భయపడ్డాం' - vv vinayak in alitho saradaga show

యంగ్​టైగర్​ ఎన్టీఆర్​ నటించిన 'ఆది' సినిమా చిత్రీకరణలో అతడికి గాయమైనట్లు దర్శకుడు వి.వి.వినాయక్​ వెల్లడించారు. గాయం నుంచి కోలుకున్న వెంటనే తారక్​ షూటింగ్​లో ఉత్సాహంగా పాల్గొన్నట్లు 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో తెలిపారు.

NTR injured his wrist during the shoot of 'Aadi' movie
'ఆది' షూటింగ్​లో ఎన్టీఆర్​ గాయపడ్డాడు: వినాయక్​
author img

By

Published : Oct 20, 2020, 11:22 AM IST

'ఆది' సినిమా షూటింగ్​ చేసేటప్పుడు ఎన్టీఆర్​కు గాయమైందని 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో దర్శకుడు వి.వి.వినాయక్​ చెప్పారు. సన్నివేశాన్ని చిత్రీకరించే క్రమంలో తారక్​ మణికట్టుకు గాయమైందని.. ఆ బాధతో ఎన్టీఆర్​ విలవిలలాడినట్లు వెల్లడించారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఉత్సాహంగా షూటింగ్​లో పాల్గొన్నాడని తెలిపారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"ఎన్టీఆర్​కు గాయమవ్వగానే ముందు భయపడిపోయా. చేతి నుంచి రక్తం బాగా పోతుంది. 17 ఏళ్ల కుర్రాడు కదా.. గాయం నొప్పికి​ బాగా ఏడ్చేస్తున్నాడు. ఆ సమయంలో ఏం చేయాలో మాకందరికి తోచలేదు. దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్తే అక్కడున్న డాక్టర్​ మమ్మల్ని మరింత భయపెట్టేశాడు. చేతి మణికట్టు దగ్గర మృదువైన నరం ఉంటుందని.. దాన్ని ఏమి చేయలేక వైజాగ్​లోని ఆస్పత్రికి వెళ్లమని ఆ వైద్యుడు సూచించాడు. రక్తస్రావం కాకుండా గట్టిగా కట్టు కట్టాం. తారక్​ వాళ్ల అమ్మకు ఫోన్​ చేసి 'మమ్మీ.. మమ్మీ' అని ఏడ్చేస్తున్నాడు. వైజాగ్​ చేరుకుని ట్రీట్​మెంట్​ చేయించాం. ఆ గాయం తగ్గాక ఆ సన్నివేశాన్ని పూర్తి చేద్దామని తారక్​ చెప్పాడు. ఇక రాత్రి షూటింగ్​ పెట్టి ఒంటి చేత్తో ఫైట్​ చేసే సన్నివేశాన్ని చిత్రీకరించాం" అని వినాయక్​ చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.