యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని 'ఆర్‌ఆర్‌ఆర్' నుంచి ఫస్ట్‌లుక్ కానీ స్పెషల్ టీజర్ కానీ ఉంటుందని అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. అయితే ఎన్టీఆర్ బర్త్‌డేకు ఎలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వడం లేదని తాజాగా 'ఆర్‌ఆర్‌ఆర్' టీమ్ వెల్లడించింది. లాక్‌డౌన్ పొడిగింపు నేపథ్యంలో పనులన్నీ నిలిచిపోయాయని అందువల్ల వీడియోను కానీ ఫస్ట్‌లుక్‌ను కానీ విడుదల చేయలేకపోతున్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ పెట్టింది.
-
We don't want to release something just for the sake of it and we promise that the wait will absolutely be worth it! Whenever it comes to you, be sure it will be the biggest festival for all of us! 😊🔥🌊 #RRRMovie
— RRR Movie (@RRRMovie) May 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">We don't want to release something just for the sake of it and we promise that the wait will absolutely be worth it! Whenever it comes to you, be sure it will be the biggest festival for all of us! 😊🔥🌊 #RRRMovie
— RRR Movie (@RRRMovie) May 18, 2020We don't want to release something just for the sake of it and we promise that the wait will absolutely be worth it! Whenever it comes to you, be sure it will be the biggest festival for all of us! 😊🔥🌊 #RRRMovie
— RRR Movie (@RRRMovie) May 18, 2020
"లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించిన నేపథ్యంలో పనులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తారక్ పుట్టినరోజును పురస్కరించుకుని ఏదైనా స్పెషల్ వీడియోను విడుదల చేయాలని భావించాం. అందుకు మేము ఎంతగానో కష్టపడ్డాం. కాకపోతే వీడియో పూర్తి కాలేదు. అందువల్ల మేము ఆయన పుట్టినరోజు నాడు ఫస్ట్‌లుక్ కానీ, వీడియో సర్‌ప్రైజ్ కానీ ఇవ్వడం లేదు. మీ ఎదురుచూపులకు తగ్గట్టుగానే అద్భుతమైన వర్క్‌ను మీకు అందిస్తాం. ఒక్కసారి అది విడుదలైన రోజు మనందరికీ పండగ అవుతుంది" అని ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ పేర్కొంది. 'ఆర్‌ఆర్‌ఆర్' పెట్టిన ట్వీట్‌తో తారక్ అభిమానులు నిరాశకు గురయ్యారు.
రామ్‌చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమురం భీమ్‌గా తారక్ కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్, హాలీవుడ్ తారలు సందడి చేయనున్నారు.
ఇదీ చూడండి.. థియేటర్లలోనే 'నిశ్శబ్దం'.. నిర్మాత క్లారిటీ