ETV Bharat / sitara

'అఖండ' ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు ఎన్టీఆర్! - అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్

బాబాయ్ బాలయ్య 'అఖండ'(akhanda release date) కోసం అబ్బాయ్ ఎన్టీఆర్(ntr movies) అతిథిగా రానున్నారు. ప్రస్తుతం ఈ విషయం చర్చల్లో ఉన్నప్పటికీ త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

balakrishna ntr
బాలకృష్ణ ఎన్టీఆర్
author img

By

Published : Nov 19, 2021, 8:24 AM IST

నందమూరి ఫ్యాన్స్​కు ఇది సూపర్​ వార్త! ఎందుకంటే నందమూరి హీరోలిద్దరూ ఒకే వేదికపై కనువిందు చేయనున్నట్లు తెలుస్తోంది.

అగ్ర కథానాయకుడు బాలకృష్ణ కొత్త సినిమా 'అఖండ'(akhanda movie). డిసెంబరు 2న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే నవంబరు 27వ తేదీన ప్రీ రిలీజ్​ ఈవెంట్​(akhanda pre release event) నిర్వహించాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే హీరోలు ఎన్టీఆర్(ntr jr new movie), నానిలను ఈవెంట్​కు ఆహ్వానించారట. అందుకు వారిద్దరూ సుముఖత వ్యక్తం చేశారని.. త్వరలో ప్రకటన వచ్చే అవకాశముంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఒకవేళ ఇదే నిజమైతే నందమూరి ఫ్యాన్స్​కు నిజంగా పండగే. గతంలో 'అరవింద సమేత' ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు బాలయ్య(balayya dialogues), కల్యాణ్​రామ్​ హాజరయ్యారు. అప్పుడు అబ్బాయి కోసం బాబాయ్ వస్తే.. ఇప్పుడు బాబాయ్​ కోసం అబ్బాయ్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

'అఖండ'లో(balakrishna akhanda movie) బాలయ్య రెండు పాత్రల్లో నటించారు. ఆయన సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా చేసింది. శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రలు పోషించారు. తమన్(thaman songs) సంగీతమందించగా, బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. మిర్యాల రవీందర్ రెడ్డి.. ద్వారకా క్రియేషన్స్​ పతాకంపై నిర్మించారు.

మరోవైపు ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమాతో(rrr release date) జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నాని 'శ్యామ్​సింగరాయ్' చిత్రం(shyam singha roy story) డిసెంబరు 24న థియేటర్లలోకి రానుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.