ETV Bharat / sitara

NTR: ఆ పాత్రతో సాహసం చేసిన ఎన్టీరామారావు - ఎన్టీఆర్ న్యూస్

ఎన్నో అద్భుత చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఎన్టీరామారావు.. కెరీర్​ ప్రారంభంలోనే ఓ పాత్రతో సాహసం చేసి విజయవంతమయ్యారు. ఆయన జయంతి సందర్భంగా ఆ విశేషాలు మరోసారి మీకోసం.

NT RAMA RAO TOOK RISK WITH RAJU PEDA MOVIE
ఎన్టీరామారావు
author img

By

Published : May 28, 2021, 7:30 AM IST

హీరో అంటే స్టైల్​గా కనిపించాలి. ఫైట్లు చేయాలి లాంటివి చాలా సినిమాల్లో చూస్తుంటాం. కానీ కొన్నిసార్లు మన కథానాయకులు, విభిన్న పాత్రలతో మెప్పిస్తుంటారు. అయితే నందమూరి తారక రామరావు ఇలాంటి సాహసాన్ని చాలా ఏళ్ల క్రితమే చేశారు. ఓ పాత్ర కోసం ఏకంగా డీగ్లామరైజ్​గా కనిపించి, ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచారు. ఆయన జయంతి(మే28) సందర్భంగా ఆ విశేషాలు మీకోసం.

1954లో వచ్చిన 'రాజు- పేద' సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. రాజులా, పోలిగాడు అనే దొంగ పాత్రలో నటించారు. మాములుగా ఏ హీరో కూడా ఇలాంటి పాత్ర చేయడానికి అప్పట్లో సాహసించరు. కానీ ఎన్టీఆర్ ఒప్పుకొన్నారు. అందరూ షాకయ్యారు. ఎందుకంటే ఆ పాత్ర కోసం గోనెగుడ్డలు ధరించాలి, మొహమంతా మసి పూసుకోవాలి. దానికి తోడు ప్రతినాయక ఛాయలు. అయినా సరే ఎన్టీఆర్ తాను చేస్తానని ముందుకొచ్చారు. ఎందుకంటే దర్శకుడు బీఏ సుబ్బారావుపై ఆయనకు విపరీతమైన గౌరవం. దానికితోడు ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయాలనే కసి మరోవైపు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అప్పటికే 'పాతాళభైరవి', 'మల్లీశ్వరి', 'పెళ్లిచేసిచూడు' లాంటి వరుస హిట్లతో ఉన్న ఆయన సాహసం చేసి 'రాజు పేద' చిత్రంలో పోలిగాడు పాత్రలో నటించారు. ఫైనల్​గా ఎన్టీఆర్ రిస్క్ ఫలించింది. సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.