ETV Bharat / sitara

'అలాంటి సినిమాల్లో నటించాననే తృప్తి చాలు'

author img

By

Published : Nov 22, 2020, 8:59 AM IST

ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకునేలా కథలను ఎంపికచేసుకుంటా అంటోంది బాలీవుడ్​ హీరోయిన్​ వాణీ కపూర్​. తన పాత్ర ప్రధానంగా లేకపోయినా మంచి సినిమాలో నటించాననే తృప్తి ఉంటే చాలని చెబుతోంది.

Nothing comes easy..wait for the right time: Vaani Kapoor
'అలాంటి సినిమాల్లో నటించాననే తృప్తి చాలు'

"మంచి సినిమాల్లో నటించాలనే కోరిక వల్లే నేను ఎక్కువ చిత్రాలను అంగీకరించడం లేదు" అంటోంది బాలీవుడ్​ హీరోయిన్​ వాణీ కపూర్​. ఆమె అక్షయ్​ కుమార్​తో కలిసి నటించిన 'బెల్​బాటమ్​' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. కరోనా కాలంలో షూటింగ్​ పూర్తి చేసుకుని హిందీలో విడుదలవుతున్న తొలి సినిమా ఇదే. మరో రెండు చిత్రాలతో వాణీ బిజీగా ఉంది. గతేడాది వచ్చిన 'వార్​' విజయం సాధించాకే కెరీర్​ను ఎలా నిర్మించుకుకోవాలన్న దానిపై స్పష్టత వచ్చిందని చెబుతోంది.

"అవకాశాలు అంత సులువుగా దక్కవు. అందుకే ప్రజల్లో గుర్తింపు దక్కేలా కథలను ఎంచుకోవాలని నిశ్చయించుకున్నాను. కథ నా పాత్ర చుట్టే తిరగకున్నా ఫర్వాలేదు కానీ, నన్ను అద్భుతమైన చిత్రాల్లో చూడాలనుకుంటున్నాను. 'బేఫికర్​', 'వార్​' చిత్రాల్లో నా నటనను చూసే దర్శకుడు అభిషేక్​ కపూర్​ తన సినిమా 'చండీగఢ్​ కరే ఆషికి'లో అవకాశం ఇచ్చారు. ఏదీ అంత సులువుగా రాదు. సరైన సమయం కోసం ఓపికగా ఎదురుచూడాలనేదాన్ని నేను నమ్ముతాను" అని చెప్పింది వాణీ కపూర్​. ఆమె ప్రస్తుతం 'షమ్​షేరా', 'చండీగఢ్​ కరే ఆషికి' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.