ETV Bharat / sitara

'24'లో సూర్య-సమంత నటించాల్సింది కాదు.. కానీ? - విక్రమ్ ఇలియానా 24 సినిమా

'24' సినిమాలో సూర్య-సమంత కంటే ముందు మరో జోడీ నటించింది. వారెవరు? అప్పుడు మొదలైన షూటింగ్ ఎందుకు ఆగిపోయింది? తదితర విశేషాలు మీకోసం.

'24'లో సూర్య-సమంత నటించాల్సింది కాదు.. కానీ?
సూర్య సమంత
author img

By

Published : Jun 14, 2020, 12:50 PM IST

Updated : Jun 14, 2020, 8:15 PM IST

టైమ్ ట్రావెల్​ కథతో తీసిన '24' సినిమా.. ఎంతలా అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోహీరోయిన్ సూర్య-సమంత.. నటనతో పాటు అద్భుతమైన కెమిస్ట్రీతో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు. అయితే ఈ చిత్రం కోసం తొలుత అనుకున్నది వీరిని కాదు. ఈ ఆసక్తికర విషయాన్ని దర్శకుడు విక్రమ్ కె కుమార్ చెప్పారు.

Suriya 24 cinema
24 సినిమాలోని విభిన్న పాత్రల్లో సూర్య

అసలేం జరిగింది?

దర్శకుడు విక్రమ్ చాలాకాలం క్రితమే '24' ప్రాజెక్టు ప్రారంభించారు. విక్రమ్​, ఇలియానాలతో తొలి షెడ్యూల్​ పూర్తి చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల షూటింగ్ ఆపేశారు. ఆ తర్వాత స్క్రిప్ట్ మూలన పడిపోయింది. అనంతరం కొన్నేళ్లకు తెలుగు బ్లాక్​బస్టర్​ 'మనం'ను రీమేక్ చేసే విషయమై సూర్య-విక్రమ్ చర్చలు జరిపారు. ఈ క్రమంలో తన దగ్గరున్న '24' కథను సూర్యకు వినిపించారు ఈ దర్శకుడు. ఈ స్క్రిప్ట్​కు ఫిదా అయిపోయిన హీరో.. నటించేందుకు సిద్ధమయ్యారు. అలా సూర్య-సమంత ఇందులోకి ఎంటరయ్యారు. విజువల్స్, నేపథ్య సంగీతం, మూడు పాత్రల్లో సూర్య నటన.. అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. ప్రస్తుతం '24'కు సీక్వెల్ తీసే పనిలో ఉన్నారు డైరెక్టర్ విక్రమ్.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

Last Updated : Jun 14, 2020, 8:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.