ETV Bharat / sitara

శ్రుతిహాసన్​ కాదు.. ఆ ఛాన్స్ కొట్టేసిన రమ్యకృష్ణ! - బిగ్​బాస్ 5 విన్నర్

ప్రముఖ నటి రమ్యకృష్ణ అద్భుత అవకాశం సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు బిగ్​బాస్​లో ఇదివరకే హోస్ట్​గా చేసిన ఆమె.. ఇప్పుడు తమిళంలోనూ అలాంటి ఛాన్సే దక్కించుకుందట.

ramya krishna
రమ్యకృష్ణ
author img

By

Published : Nov 27, 2021, 10:11 AM IST

సీనియర్ నటి రమ్యకృష్ణ బంపర్ ఆఫర్ కొట్టేసింది! తమిళ బిగ్​బాస్-5కు కొన్ని వారాలపాటు హోస్ట్​గా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు హోస్ట్ చేసిన విలక్షణ నటుడు కమల్​ హాసన్​ ఇటీవల కొవిడ్ బారిన పడటమే ఇందుకు కారణం.

ఇటీవల యూఎస్​ వెళ్లి వచ్చిన కమల్​హాసన్​కు కొవిడ్ పాజిటివ్​గా తేలింది. దీంతో ఆయన క్వారంటైన్​లోకి వెళ్లారు. దీంతో బిగ్​బాస్ షోకు హోస్ట్ ఎవరా చేస్తారా అనే సందేహం వచ్చింది.

ramya krishna
నటి రమ్యకృష్ణ

తొలుత కమల్ కుమార్తె, హీరోయిన్ శ్రుతిహాసన్​ను ఇందుకోసం ఎంపిక చేశారట. కానీ ఏమైందో ఏమోగానీ చివర్లో ఆమెను కాదని ఆ ఛాన్స్ రమ్యకృష్ణను వరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈమెకు తెలుగు బిగ్​బాస్​లోనూ హోస్ట్​గా చేసిన అనుభవం ఉండటం కలిసొచ్చింది.

'బాహుబలి' ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ.. తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో కీలకపాత్రలు చేస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.