తమిళ సినిమా 'కూజంగల్'కు అరుదైన గౌరవం లభించింది. 94వ అకాడమీ అవార్డ్స్ విదేశీ చిత్రాల కేటగిరిలో భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. ఈ చిత్రాన్ని నయనతార, విఘ్నేశ్ శివన్ కలిసి రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. పీఎస్ వినోద్ రాజ్ దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా టైగర్ అవార్డు ఫిల్మ్ ఫెస్టివల్లో సత్తాచాటింది. 50వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ప్రదర్శించబడింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ విఘ్నేశ్ శివన్ హర్షం వ్యక్తం చేశారు.
-
There’s a chance to hear this!
— Vignesh Shivan (@VigneshShivN) October 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
“And the Oscars goes to …. 🎉🎉🥰🥰🥰🥰 “
Two steps away from a dream come true moment in our lives …. ❤️❤️🥰🥰🥰🥰🥰🥰🥰#Pebbles #Nayanthara @PsVinothraj @thisisysr @AmudhavanKar @Rowdy_Pictures
Can’t be prouder , happier & content 💝 pic.twitter.com/NKteru9CyI
">There’s a chance to hear this!
— Vignesh Shivan (@VigneshShivN) October 23, 2021
“And the Oscars goes to …. 🎉🎉🥰🥰🥰🥰 “
Two steps away from a dream come true moment in our lives …. ❤️❤️🥰🥰🥰🥰🥰🥰🥰#Pebbles #Nayanthara @PsVinothraj @thisisysr @AmudhavanKar @Rowdy_Pictures
Can’t be prouder , happier & content 💝 pic.twitter.com/NKteru9CyIThere’s a chance to hear this!
— Vignesh Shivan (@VigneshShivN) October 23, 2021
“And the Oscars goes to …. 🎉🎉🥰🥰🥰🥰 “
Two steps away from a dream come true moment in our lives …. ❤️❤️🥰🥰🥰🥰🥰🥰🥰#Pebbles #Nayanthara @PsVinothraj @thisisysr @AmudhavanKar @Rowdy_Pictures
Can’t be prouder , happier & content 💝 pic.twitter.com/NKteru9CyI
భారత్ తరఫున అధికారిక ఎంట్రీ కోసం 14 సినిమాలు పోటీ పడ్డాయి. అందులో హిందీ చిత్రాలు 'షేర్నీ', 'సర్దార్ ఉద్ధమ్'. 'మండేలా'(తమిళం), 'నాయాట్టు'(మలయాళం) పోటీ పడ్డాయి. ఈ చిత్రాలను దాటి మన దేశం తరఫున 'కూజంగల్' ఆస్కార్‌కు నామినేట్ అవ్వడం విశేషం. వచ్చే ఏడాది మార్చి 27 ఆస్కార్ అవార్డులు ప్రదానం చేయనున్నారు.
ఇదీ చూడండి: అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో తమిళ చిత్రం రికార్డు