మున్నాభాయ్ సిరీస్‌లో మూడో చిత్రం కోసం దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ, రచయిత అభిజత్ జోషీల వద్ద మూడు కథలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించాడు నటుడు అర్షద్ వార్సి. 'మున్నాభాయ్'లో సంజయ్‌దత్ పక్కన 'సర్క్యూట్' పాత్రలో నటించాడు అర్షద్. కొత్త చిత్రం ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో మాత్రం తెలియదంటున్నాడు వార్సి.
"మున్నాభాయ్ సీక్వెల్ కోసం మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి. నిర్మాత, దర్శకుడు, నటీనటులు, ప్రేక్షకులు అందరూ సిద్ధంగా ఉన్నారు. అయినా సినిమా ఎందుకు పట్టాలెక్కడం లేదో తెలియడంలేదు."
-- అర్షద్ వార్సి, బాలీవుడ్ నటుడు
సంజయ్ దత్, అర్షద్ వార్సిలతో దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ, నిర్మాత విధు వినోద్ చోప్రా తెరకెక్కించిన 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' చిత్రం 2003లో బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. 2006లో దానికి సీక్వెల్‌గా రూపొందిన 'లగే రహో మున్నాభాయ్' కూడా ఆకట్టుకుంటుంది. వీటికి కొనసాగింపుగా మరో చిత్రం వస్తుందని ఇప్పటికే అనేక కథనాలు వచ్చాయి.
మున్నాభాయ్ 3 కోసం ఓ కాన్సెప్ట్‌పై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు చోప్రా ఫిబ్రవరిలో తెలిపారు. కథకు మరిన్ని మెరుగులు దిద్దుతున్నట్లు వెల్లడించారు.
తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన 'శంకర్‌దాదా ఎంబీబీఎస్', 'శంకర్‌దాదా జిందాబాద్' చిత్రాలు మున్నాభాయ్ ఆధారంగా రూపొందినవే.
ఇదీ చూడండి: 'క్రేజీ అంకుల్స్'తో నవ్వులు పండిస్తున్న శ్రీముఖి!