ETV Bharat / sitara

రణ్​బీర్​-సందీప్​ వంగా సినిమా టైటిల్ అదేనా?

author img

By

Published : Dec 19, 2020, 3:09 PM IST

'కబీర్​ సింగ్'​ దర్శకుడు సందీప్​ రెడ్డి వంగా, బాలీవుడ్​ స్టార్ రణ్​బీర్​ కపూర్​ల కొత్త సినిమాకు 'డెవిల్​' అనే టైటిల్​ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇదే పేరును మరో బాలీవుడ్​ దర్శకుడు రిజిస్టర్ చేసుకోవడం వల్ల సందీప్​ తన సినిమా టైటిల్​ను మార్చారట.

Not Devil but this will be title of Ranbir Kapoor's next with Sandeep Vanga Reddy
రణ్​బీర్​-సందీప్​ వంగా సినిమా టైటిల్​ 'డెవిల్'​ కాదా?

'కబీర్​ సింగ్'​​తో బాలీవుడ్​లో ఘనవిజయాన్ని అందుకున్న దర్శకుడు సందీప్​ రెడ్డి వంగా. హిందీలో ఆయన రెండో సినిమాను బాలీవుడ్​ స్టార్​ రణ్​బీర్​ కపూర్​తో చేయనున్నారు. ఈ సినిమాకు 'డెవిల్'​ అనే టైటిల్​ పెట్టినట్లుగా ఏడాది నుంచి ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు ఆ టైటిల్​ను చిత్రబృందం మార్చినట్లు తెలుస్తోంది.

'డెవిల్'​ టైటిల్​ను ప్రముఖ దర్శకుడు సాజిద్​ నదియా​వాలా రిజిస్టర్ చేసుకోగా.. సందీప్​ బృందం ఆ పేరును వదులుకున్నారని సమాచారం. గ్రాండ్​సన్​ ఎంటర్​టైన్​మెంట్స్​ పతాకంపై సల్మాన్​ ఖాన్​ హీరోగా చేయనున్న 'కిక్' సీక్వెల్​కు ఈ​ టైటిల్​ను సాజిద్​ వినియోగించనున్నారట.

ప్రస్తుతం ఈ చిత్రానికి 'ఎనిమల్​' అనే పేరును పరిశీలిస్తున్నారు దర్శకుడు సందీప్​ వంగా. డార్క్ క్రైమ్​ థ్రిల్లర్​ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాను టి-సిరీస్​ సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం రణ్​బీర్​ నటిస్తున్న 'బ్రహ్మాస్త్ర', 'షంషేరా' సినిమాలు పూర్తి కాగానే ఈ సినిమా పట్టాలెక్కనుంది.

ఇదీ చూడండి:22 కిలోల బరువు తగ్గిన స్టార్‌హీరో కుమార్తె!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.