Corona bollywood: బాలీవుడ్లో ఈ మధ్య కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పుడు నటి, డ్యాన్సర్ నోరా ఫతేహికి కూడా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయమై ఆమె ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది.
వైరస్ తనపై చాలా గట్టిగానే ఎఫెక్ట్ చూపించిందని, మరికొన్ని మంచంపై నుంచి లేవలేని పరిస్థితి వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని తెలిపింది. వైరస్ చాలా వేగంగా వ్యాప్తిస్తుందని అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని పేర్కొంది. ఆరోగ్యం కంటే మీకు ఏది ముఖ్యం కాదని రాసుకొచ్చింది.
నోరాకు రెండు రోజుల క్రితమే కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయిందని ఆమె సన్నిహితుడు ఒకరు చెప్పారు. ఆమె బయట తిరిగినట్లు కనిపిస్తున్న ఫొటోలు పాతవి అని ఆయన స్పష్టం చేశారు.
నోరా ఫతేహి చివరగా జాన్ అబ్రహం 'సత్యమేవ జయతే 2' సినిమాలో కనిపించింది. ఈమె తెలుగులోనూ పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో అలరించి గుర్తింపు తెచ్చుకుంది.
ఇవీ చదవండి:
- Nora fatehi car accident: నటి నోరా ఫతేహి కారుకు ప్రమాదం
- స్టార్ హీరోయిన్ నోరా ఫతేహికి ఈడీ చిక్కులు- అతడితో పరిచయమే కారణం
- బార్లో వెయిటర్‌గా పనిచేశా: నోరా ఫతేహి
- పాము కాటుకు గురైన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్
- బాలీవుడ్లో చాలా ఆఫర్స్ వచ్చాయి.. కానీ: అల్లు అర్జున్
- ఈడీ విచారణకు బాలీవుడ్ నటి- ఆ 50 ప్రశ్నలకు జవాబు దొరికేనా?