చెన్నైకి చెందిన సుకేశ్ చంద్రశేఖర్(Sukesh Chandrasekhar Case) రూ. 200కోట్ల దోపిడీ కేసులో భాగంగా నటి, డ్యాన్సర్ నోరా ఫతేహి(Nora Fatehi News Today) గురువారం ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు. సుకేశ్‌తో పరిచయాలపై ఈడీ అధికారులు ఆమెను విచారిస్తున్నారు.
ఈ విచారణలో భాగంగా నోరా ఫతేహి వాంగూల్మాన్ని తీసుకోనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్(sukesh chandrasekhar jacqueline)ను ఈడీ ఇటీవల ప్రశ్నించింది. ఈ విచారణలో జాక్వెలిన్ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. శుక్రవారం మరోమారు విచారణకు హాజరుకావాలని ఆమెకు సమన్లు జారీ చేసింది.
ఇదీ జరిగింది..
రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్‌లకు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రూ.200 కోట్లు వసూలు చేశాడు సుకేశ్ చంద్రశేఖర్. శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది దిల్లీ ఆర్థిక నేరాల నిరోధక విభాగం(ఈఓడబ్ల్యూ). కేంద్ర న్యాయశాఖలోని ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని వారిని మోసం చేసినట్లు తేల్చారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇదీ చదవండి: