ETV Bharat / sitara

హీరోయిన్ దిశాను ముద్దుపెట్టుకోలేదు: సల్మాన్​ఖాన్ - Salman Khan latest news

'రాధే' సినిమాలో హీరోయిన్ దిశా పటానీని తాను ముద్దుపెట్టుకోలేదని హీరో సల్మాన్ ఖాన్ స్పష్టం చేశారు. అది తెరపై మాత్రమే కనిపిస్తుందన అన్నారు.

salman radhe movie kiss scene
సల్మాన్ ఖాన్
author img

By

Published : May 2, 2021, 8:39 PM IST

బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ ఐదు పదుల వయసులోనూ కుర్ర హీరోలతో పోటీపడుతూ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటున్నారు. అయితే తన సినిమాల్లో మొదటి నుంచి లిప్‌లాక్‌ సీన్లకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సల్మాన్‌ 'రాధే' చిత్రంలోని ఓ లిప్‌లాక్‌ సీన్‌పై ఆయన స్పందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో సల్మాన్‌, ఒక సన్నివేశంలో హీరోయిన్‌ దిశాపటానీకి ముద్దు పెడుతూ కనిపించారు. అది కాస్తా సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

salman radhe movie kiss scene
రాధే సినిమాలోని సన్నివేశం

'ఈ సినిమాలో దిశా చాలా అద్భుతంగా నటించింది. ఆమె చాలా అందంగా ఉంది. ఇద్దరం ఒకే వయసువాళ్లలా కనిపించాం. లిప్‌లాక్‌ గురించి మాట్లాడాలంటే.. అసలు అది లిప్‌లాక్‌ కాదు. ఎందుకంటే నేను ఆమె పెదాలపై ముద్దుపెట్టలేదు. అది కేవలం తెరపై మాత్రమే కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే.. అసలు నేను దిశాకు ముద్దుపెట్టలేదు. ఆ సినిమాకు ముద్దు సన్నివేశం చాలా అవసరం' అని సల్మాన్‌ స్పష్టం చేశాడు.

అల్లు అర్జున్‌ 'దువ్వాడ జగన్నాథం'లోని 'సీటీమార్‌' పాటను ఈ సినిమాలో రీక్రియేట్‌ చేశారు. ప్రభుదేవా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో సల్మాన్‌ పవర్‌ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.