ETV Bharat / sitara

నేను కూరగాయలు అమ్మట్లేదు: జావేద్ - జావేద్​ హైదర్​ వైరల్​ వీడియే

తాను కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని కాదని బాలీవుడ్​ నటుడు జావేద్​ హైదర్​ స్పష్టం చేశాడు. ఆ వీడియో కేవలం వినోదం కోసమే చేసిందని తాజాగా ఇన్​స్టాగ్రామ్​లో వెల్లడించాడు. అయితే ఈ వీడియో ఇంతగా వైరల్​ అవుతుందని ఊహించలేదని తెలిపాడు.

No, I am not a vegetable vendor, says Javed Hyder on his viral video
నేను కూరగాయలు అమ్మలేదు: జావేద్​ హైదర్​
author img

By

Published : Jun 30, 2020, 10:28 AM IST

బాలీవుడ్​ స్టార్ ఆమిర్​ ఖాన్​తో 'గులామ్​' సినిమాలో కలిసి నటించిన జావేద్ హైదర్.. ప్రస్తుతం ముంబయి వీధుల్లో కూరగాయలు అమ్ముకుంటున్నాడని ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను బిగ్​బాస్ ఫేమ్ డాలీ బింద్రా తన ట్విట్టర్​లలో పంచుకుంది. అయితే ఈ వార్తలపై తాజాగా స్పందించాడు జావేద్​ హైదర్​. ఆ టిక్​టాక్​ వీడియో కేవలం సరదా కోసం చేసిందని స్పష్టం చేశాడు.

"నేను కూరగాయలు అమ్మే వాడ్ని కాదు. ఇంకా నటుడిగానే కొనసాగుతున్నా. టిక్​టాక్​లో నా అనుచరులను ప్రోత్సహించడానికి ఆ విధంగా చేశా. కష్టకాలంలో దేన్నీ వదులుకోవద్దని సందేశాన్నిచ్చే విధంగా అందులో నటించా. కానీ, కూరగాయలు అమ్ముతున్నట్లు ప్రచారం జరుగుతుందని నేను అనుకోలేదు. డాలీ బింద్రా తాజాగా తన ట్విట్టర్​ ఖాతాలో నా టిక్​టాక్​ వీడియో పోస్టు చేశారు. నేను కేవలం అందులో నటించా. ఈ విధంగా వైరల్​గా మారుతుందని నేను అనుకోలేదు".

- జావేద్​ హైదర్​, బాలీవుడ్​ నటుడు

"దేవుని దయ వల్ల రెండు నెలల నుంచి పని లేకపోయినా సాధారణ జీవితాన్ని గడుపుతున్నా. భవిష్యత్​లో నేను జీవితం సాగించడానికి కూరగాయలు అమ్మాల్సి వచ్చినా.. మరేదైనా పని చేయాల్సి వచ్చినా చేసుకుంటూ వెళ్తాను" అని వెల్లడించాడు జావేద్.

జావేద్ హైదర్.. 'గులామ్'తోపాటు బాబర్(2009), 'లైఫ్ కీ ఐసీ కీ తైసీ' (2017) లాంటి సినిమాలు, 'జెన్నీ ఔర్ జుజు' (2012) అనే టీవీ సిరీస్​లోనూ నటించాడు.

ఇదీ చూడండి... కూరగాయలు అమ్ముతున్న ఆమిర్​ఖాన్ సహనటుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.