ETV Bharat / sitara

పాపం విక్కీ-కత్రిన.. హనీమూన్​ కూడా లేకపాయే! - విక్కీ కౌశల్​ కత్రినా కైఫ్​ పెళ్లి

Katrinakaif Vickykaushal Marriage: ప్రస్తుతం తమ పెళ్లి వేడుకలో బిజీగా ఉన్న బాలీవుడ్​ లవ్​బర్డ్స్​ విక్కీ కౌశల్​-కత్రినా కైఫ్​ హనీమూన్​ను వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నారట. వివాహం అయిన వెంటనే తమ షూటింగ్స్​ను పూర్తి చేయాలని నిశ్చయించుకున్నట్లు తెలిసింది.

విక్కీకత్రినాకైఫ్​ హనీమూన్​, vicky kaushal katrinakaif honeymoon
విక్కీకత్రినాకైఫ్​ హనీమూన్​
author img

By

Published : Dec 8, 2021, 12:01 PM IST

Katrinakaif Vickykaushal Honeymoon: సాధారణంగా ఏ జంట అయినా పెళ్లి చేసుకుంటే.. ఈ వేడుకకు ముందు, తర్వాత తమ వృత్తికి కాస్త విరామం ఇస్తారు. బ్యాచిలర్​ పార్టీ, హనీమూన్​ అంటూ సరదాగా గడుపుతారు. ఇక సెలబ్రిటీల విషయానికొస్తే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాల్దీవులు సహా ఇతర విదేశీ పర్యటనలకు వెళ్లిపోతుంటారు. అయితే డిసెంబరు 9న మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్న విక్కీ కౌశల్​-కత్రినా కైఫ్​ మాత్రం ఇందుకు భిన్నం!

ఇప్పటికే పెళ్లికి ముందు బ్రేక్​ కూడా తీసుకోకుండా నిర్విరామంగా షూటింగ్స్​లో పాల్గొన్నారు విక్కీ-కత్రిన. ఇక వివాహం తర్వాత కూడా విరామం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారట! అందుకోసం హనీమూన్​ను కూడా వాయిదా వేయనున్నారని తెలిసింది. పెళ్లి అయిపోయిన వెంటనే తమ షూటింగ్స్​ను పూర్తి చేయాలని ఫిక్స్​ అయ్యారట.

ప్రస్తుతం విక్కీ.. సారా అలీఖాన్​తో కలిసి దినేశ్​ విజన్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఇది విడుదల కానుంది. కత్రిన.. విజయ్ ​సేతుపతితో కలిసి 'మేరీ క్రిస్మస్​'లో నటించనుంది. ఈ మూవీకి శ్రీరామ్​ రాఘవన్​ ​దర్శకత్వం వహించనున్నారు. పెళ్లి తర్వాత ఈ రెండు చిత్రాల షూటింగ్స్​తో విక్కీ-కత్రిన​ బిజీ కానున్నారు.

విక్కీ-కత్రిన వివాహం రాజస్థాన్​లోని ప్రముఖ సిక్స్‌సెన్సెస్‌ కోట భర్వారాలో జరుగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం సంగీత్​ కార్యక్రమం జరగగా.. నేడు హల్దీ వేడుకకు అంతా సిద్ధమైంది.

ఇదీ చూడండి: విక్కీ-కత్రిన పెళ్లికి సల్మాన్​ సిస్టర్స్​.. మరి భాయ్ వచ్చేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.