గత కొన్నిరోజుల నుంచి జూ.ఎన్టీఆర్ అభిమానులు, నటి మీరా చోప్రా మధ్య వివాదం సాగుతోంది. తారక్ ఫ్యాన్స్ అని చెబుతూ, కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని మీరాచోప్రా ఇటీవలే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మరో నటి పూనమ్ కౌర్ చేసిన ట్వీట్లు చర్చనీయాంశమవుతున్నాయి. తారల జీవితంలో ట్రోలింగ్ భాగమని, వాటిని పట్టించుకోకూడదని రాసుకొచ్చింది. అభిమానులు అమాయకులని, రాజకీయ లబ్ధి కోసం కొంతమంది వ్యక్తులు వాళ్లను ప్రేరేపిస్తున్నారని చెప్పింది.
"సరైన కారణం లేకుండా చాలామంది నా గురించి తప్పుగా ప్రచారం చేశారు. అసభ్యంగా మాట్లాడారు. కానీ ఇప్పటివరకూ నేను ఏ ఒక్క అభిమానిపై ఫిర్యాదు చేయలేదు. వారు అమాయకులని నమ్ముతా. కొంతమంది మధ్యవర్తులు తమ స్వలాభం కోసం అభిమానులను ఇలాంటి విషయాల్లో ప్రేరేపిస్తున్నారు. అందుకే నన్ను ఇబ్బందిపెట్టిన వ్యక్తులపై మాత్రమే ఫిర్యాదు చేశాను. నెట్టింట జరిగే గొడవలపై అభిమానులను నిందించొద్దు. తన ఫ్యాన్స్ వేరే వ్యక్తులతో అసభ్యంగా ప్రవర్తించాలని ఎవరు కోరుకోరు. ట్రోలింగ్ చేస్తే బాధపడాల్సిన అవసరం లేదు. వాటిని వదిలేసి మనం ప్రయాణం సాగించాలి" అని నటి పూనమ్‌కౌర్ వెల్లడించింది.
"రాజకీయ లబ్ధిలో భాగంగా ఓ నటుడిపై బురద జల్లడం కోసం నకిలీ ఖాతాలు సృష్టించి అభిమానులమని చెప్పుకుంటున్నారేమో మనకు తెలియదు. మన ఇండస్ట్రీకి రాజకీయ పార్టీలతో సంబంధం ఉందని గ్రహించాలి. అభిమానులు అమాయకులు. కొంతమంది రాజకీయ నేతలు రాక్షసులు. అలాంటి వాళ్లే ఇలాంటివి చేస్తారు" అని పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి.
ఇదీ చూడండి... లిప్‌లాక్‌తో నటి సుస్మితాసేన్ రీఎంట్రీ..!