హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వాల్ట్‌డిస్నీ తెరకెక్కిస్తున్న చిత్రం 'ఫ్రోజెన్ 2'. ఇందులోని ఎల్సా పాత్రకు తెలుగు వెర్షన్లో హీరోయిన్ నిత్యమేనన్ డబ్బింగ్ చెప్పనుంది. ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేసిందీ భామ.
![Nithya Menen to do voice over for Elsa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4979022_nithya-menen-1.jpg)
"ఇలాంటి మంచి పాత్రలకు గొంతు అరువివ్వడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను చదివిన గొప్ప స్క్రిప్టులలో ఇదొకటి" -నిత్యా మేనన్, హీరోయిన్
హిందీలో ఇదే పాత్రకు పరిణీతి చోప్రా డబ్బింగ్ చెప్పనుంది. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: హీరోయిన్గా నిత్యా మేనన్ 'హాఫ్ సెంచరీ'