నితిన్ సరసన హైబ్రీడ్ పిల్ల నటించనుందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు స్టార్ కథానాయిక సాయిపల్లవి. 'భానుమతి ఒక్కటే పీస్.. హైబ్రీడ్ పిల్ల' అంటూ యువతను 'ఫిదా' చేసింది ఈ ముద్దుగుమ్మ. అప్పటి నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలోనే నితిన్ కలిసి ఓ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది.
ఈ సినిమాతో నూతన దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం కానున్నాడని తెలుస్తోంది. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ కథను అందించనున్నారట. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. సాయి పల్లవి నటించిన 'లవ్ స్టోరీ', 'విరాటపర్వం' విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇటీవలే 'చెక్', 'రంగ్ దే' చిత్రాలతో అలరించిన నితిన్ ప్రస్తుతం 'మాస్ట్రో'లో నటిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: 'ఆయనతో పనిచేస్తానని కలలోనూ అనుకోలేదు'