ETV Bharat / sitara

నితిన్ 'చెక్' ఓటీటీ రిలీజ్ ఖరారు

author img

By

Published : May 12, 2021, 9:17 AM IST

Updated : May 12, 2021, 9:52 AM IST

యంగ్ హీరో నితిన్, చంద్రశేఖర్ యేలేటి కాంబోలో తెరకెక్కిన చిత్రం 'చెక్'. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తాజాగా ఓటీటీ రిలీజ్ ఖరారు చేసుకుంది. ఈనెల 14న డిజిటల్ ప్లాట్​ఫామ్​లో విడుదల కానుంది.

Nithin Check
నితిన్ 'చెక్'

యంగ్ హీరో నితిన్‌ కథానాయకుడిగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'చెక్'. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లు. ఇందులో ఖైదీలా కనిపించి అలరించారు నితిన్. ఈ ఏడాది ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. తాజాగా ఓటీటీ రిలీజ్ ఖరారు చేసుకుంది. ఈ మూవీ సన్​ నెక్ట్స్​ ప్లాట్​ఫామ్ వేదికగా ఈనెల 14న విడుదలవనుంది.

కథేంటంటే?

ఉగ్రవాదిగా ముద్రప‌డిన ఓ ఖైదీ ఆదిత్య (నితిన్‌). ఉరిశిక్ష ప‌డ‌టం వల్ల రోజులు లెక్కపెడుతుంటాడు. తెలివితేటలు కలిగిన ఆదిత్య తాను ఉగ్రవాదిని కాద‌ని, తానెలాంటి నేరం చేయ‌లేద‌ని కోర్టులో పిటిష‌న్ వేస్తాడు. కెరీర్‌కు మంచి జ‌రుగుతుంద‌ని తండ్రి చెప్పడం వల్ల అత‌ని కేసుని వాదించ‌డానికి ముందుకొస్తుంది న్యాయ‌వాది మాన‌స (ర‌కుల్‌ప్రీత్ సింగ్‌). కోర్టులో కేసు కొన‌సాగుతుండ‌గా, జైలులో సహ ఖైదీ శ్రీమ‌న్నారాయ‌ణ (సాయిచంద్‌) వ‌ల్ల చెస్ కూడా నేర్చుకుంటాడు ఆదిత్య‌. కోర్టులో దారుల‌న్నీ మూసుకుపోవ‌డం వల్ల రాష్ట్రప‌తి నుంచి క్షమాభిక్ష కోసం ఎదురు చూస్తుంటాడు. ఇంత‌లో అనుకోని సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం వల్ల క్షమాభిక్షకు కూడా నోచుకోడు. మ‌రికొన్ని గంట‌ల్లో ఉరి కంబం ఎక్కాల్సిన ఆదిత్య జైలు నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? అందుకు తాను నేర్చుకున్న చెస్ ఎలా సాయ‌ప‌డింది? ఈ క‌థ‌లో యాత్ర (ప్రియా ప్రకాశ్ వారియ‌ర్‌) ఎవ‌రు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : May 12, 2021, 9:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.