ETV Bharat / sitara

ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా: నితిన్​

ప్రేక్షకుల అభిరుచులకి తగ్గట్టుగా యువ కథానాయకులు కొత్తగా అడుగులు వేస్తున్నారు. కొత్త కథల్ని ఎంచుకుంటూ ప్రయాణం చేస్తున్నారు. ప్రేమకథలకి పెట్టింది పేరైన యువ కథానాయకుడు నితిన్‌ కూడా 'చెక్‌'తో అలాంటి ప్రయత్నమే చేశారు. చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో, భవ్య క్రియేషన్స్‌ నిర్మించిన చిత్రమిది. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం ఆయన హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విశేషాలపై ఓ లుక్కేద్దాం.

nithin
నితిన్
author img

By

Published : Feb 25, 2021, 6:46 AM IST

మీ శైలికి భిన్నమైన ఈ సినిమా చేయడం వెనక కారణమేంటి?

'శ్రీనివాస కళ్యాణం' తర్వాత నేను ఆలోచించి చేసిన సినిమా 'చెక్‌'. వరుసగా మూడు పరాజయాలు రావడంతో ఇకపైన వాణిజ్య ప్రధానమైన ఓ సినిమా, మరొక భిన్నమైన కథతో కూడిన సినిమా చేయాలనుకున్నా. అలా 'భీష్మ' అంగీకరించిన సమయంలోనే ఈ కథ విని ఓకే చెప్పా. ఇలాంటి విభిన్నమైన సినిమాలు చేయడంలో చంద్రశేఖర్‌ యేలేటి మాస్టర్‌. మొదట వేరే కథ అనుకున్నా కుదర్లేదు. తర్వాత 'చెక్‌' కథ చెప్పారు. ఈ లైన్‌ వినగానే నాకు బాగా నచ్చేసింది. ఎక్కువ కథ జైలు నేపథ్యంలో సాగుతుంది.

మల్టీ స్టారర్‌ చిత్రాలు చేసే ఆలోచన ఉందా?

కచ్చితంగా చేస్తా. అవకాశం వస్తే నాకు ఇష్టమైన హీరో పవన్‌కల్యాణ్‌తో కలిసి నటిస్తా. ఆ అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నా.

ఈ సినిమా కోసం తొలినాళ్లల్లో ఎక్కువ టేక్స్‌ తీసుకున్నానని చెప్పారు. ఎందుకు?

దర్శకుడు యేలేటి సినిమా తీసే స్టైల్‌ వేరు. ఆయన్ని అర్థం చేసుకోవడానికి ఓ వారం రోజులు పట్టింది. అందుకే ఎక్కువ టేక్స్‌ తీసుకున్నా. 'జయం' తర్వాత మళ్లీ అన్ని టేక్స్‌ తీసుకున్నది ఈ చిత్రానికే. వారం తర్వాత సులభంగా చేసేశా. కామెడీ, రొమాంటిక్‌ సన్నివేశాల్లాంటివేవీ ఈ సినిమాలో ఉండవు. ఒకే ఒక్క పాట తప్ప! ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఇలాంటి విభిన్నమైన సినిమాలే కోరుకుంటున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రేక్షకులు ఓటీటీ వేదికల్లో రకరకాల సినిమాలు చూశారు. రెండేళ్ల కిందట ఇలాంటి సినిమాలు చేయడం సాహసం అనుకునేవాళ్లమేమో కానీ... ఇప్పుడు కాదు.

'చెక్‌' కోసం ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారా?

నేనొక సినిమా కోసం ప్రత్యేకంగా ఎప్పుడూ సన్నద్ధం కాలేదు. దర్శకుల్ని అనుసరిస్తుంటాను. వాళ్లు ఏం చెబితే అది చేస్తా. అయితే ఈ సినిమా చేస్తున్నన్నాళ్లూ నాకొక భిన్నమైన అనుభవం ఎదురైంది. 'భీష్మ', 'రంగ్‌దే' సెట్స్‌లో సరదాగా గడిపేవాణ్ని. 'చెక్‌' సెట్లో నెమ్మదిగా, నాదైన ప్రపంచంలో గడిపేవాణ్ని. ఇందులో ఉరిశిక్ష పడిన ఖైదీగా కనిపిస్తాను కాబట్టి, ఆ సెట్‌ వాతావరణం, పాత్ర తాలూకు భావోద్వేగాలు నాపైన ఒక రకమైన ప్రభావం చూపించేవి. కొన్నిసార్లు ఇంటికెళ్లాక కూడా అదే పరిస్థితే. రకుల్‌ ఇందులో న్యాయవాదిగా నటించింది. ఒక మంచి పాత్రలో నటించడానికి ముందుకొచ్చిన రకుల్‌కి థ్యాంక్స్‌ చెప్పాలి. ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కూడా బాగా నటించింది. నిర్మాతకి అభిరుచి ఉంటే తప్ప.. ఇలాంటి సినిమాల్ని నిర్మించలేరు. భవ్య సంస్థకి ఈ చిత్రం మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టాలని కోరుకుంటా. కల్యాణి మాలిక్‌ తన సంగీతంతో ఈ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లారు.

"పెళ్లి తర్వాత జీవితంలో పెద్దగా మార్పులంటూ ఏమీ లేవు. పెళ్లికి ముందు కూడా షాలిని ఇంటికి వచ్చి వెళ్తుండేది. పెళ్లి తర్వాత కూడా తను ఎప్పట్నుంచో ఇంట్లో ఉంటున్న ఓ కుటుంబ సభ్యురాలిగానే ఉంది తప్ప కొత్తగా ఏమీ లేదు. తను, నేను సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుకోం. అది వేరే జీవితం, ఇది వేరే జీవితం. అయితే 'చెక్‌' ట్రైలర్‌ మాత్రం తనకి బాగా నచ్చింది. వాళ్లది డాక్టర్ల కుటుంబం. మాది యాక్టర్‌ కుటుంబం. రెండు కుటుంబాలు బాగా కలిసిపోయాయి. అనారోగ్యానికి గురైతే ఇదివరకు డాక్టర్‌ దగ్గరికి వెళ్లేవాణ్ని. ఇప్పుడు మా అత్తమామలకి ఫోన్‌ చేస్తున్నా (నవ్వుతూ)".

"ఇప్పటిదాకా నా కెరీర్‌లో ఎక్కువ సవాళ్లతో కూడుకున్న సినిమా 'పవర్‌పేట'. 20, 40, 60 ఏళ్ల వయసున్న వ్యక్తిగా కనిపిస్తా. ఇక ‘రంగ్‌ దే’ విషయానికొస్తే అది నేను చేయబోయే చివరి ప్రేమకథ అవుతుంది. చిత్ర పరిశ్రమకొచ్చి 19వ ఏడాది ఇది. ఇంకా లవర్‌బోయ్‌ అని పిలిపించుకోవడం వద్దు అనిపిస్తోంది (నవ్వుతూ). 'రంగ్‌దే' కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది.

ఇదీ చూడండి: నితిన్ మూడు సినిమాలు.. రాబోయే ఆరు నెలల్లో విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.