ETV Bharat / sitara

అమెరికన్ ఖైదీ కథతో నితిన్ 'చెక్' సినిమా! - నితిన్ లేటేస్ట్ న్యూస్

నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'చెక్'. ఇందులో నితిన్ చెస్ ప్లేయర్​గా కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాను ఓ అమెరికన్ ఖైదీ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కించారట.

Nithiin, Rakul's 'Check' inspired by an American man
అమెరికన్ ఖైదీ కథతో నితిన్ 'చెక్' సినిమా!
author img

By

Published : Feb 15, 2021, 2:16 PM IST

Updated : Feb 15, 2021, 3:05 PM IST

నితిన్ నటించిన 'చెక్' విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. అయితే ఈ సినిమాను నిజజీవిత సంఘటనల స్ఫూర్తితోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తొమ్మిదేళ్ల శిక్ష అనుభవించిన ఓ అమెరికన్ ఖైదీ.. జైలులో ఉన్నన్ని రోజులు చెస్​ ఆడుతూనే ఉన్నాడు. దీనికి కాస్త కల్పితం జోడించి 'చెక్' రూపొందించినట్లు సమాచారం.

ఈ సినిమాలో కేవలం ఒక్క పాట మాత్రమే ఉంది. దానిని ఈ మధ్యే గోవాలో చిత్రీకరించారు. దాంతో షూటింగ్ మొత్తం పూర్తయింది. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. కల్యాణి మాలిక్ సంగీతమందించగా, చంద్రశేఖర్​ యేలేటి దర్శకత్వం వహించారు. వి.ఆనందప్రసాద్ నిర్మించారు.

ఇది చదవండి: కరోనా అయితే ఏంటి.. సెలబ్రిటీల పెళ్లికి అడ్డేంటి!

Last Updated : Feb 15, 2021, 3:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.