బాలీవుడ్లో చిన్న సినిమాగా వచ్చిన 'అంధాధున్'.. ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. హీరో ఆయుష్మాన్‌కు జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. ఈ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగు హక్కుల్ని.. ప్రముఖ నిర్మాత సుధాకర్‌రెడ్డి సొంతం చేసుకున్నారు. ఇందులో తన కుమారుడు, హీరో నితిన్ నటిస్తాడనే వార్తలు వచ్చాయి. ఇప్పుడీ విషయంలో పలు మార్పులు జరుగుతున్నాయట.
'అంధాధున్' తెలుగు రీమేక్ కోసం తొలుత హీరో నితిన్, దర్శకుడు సుధీర్ వర్మను తీసుకోవాలని అనుకున్నారట. కానీ నితిన్ నటించేందుకు ఆసక్తి చూపించట్లేదట. అందుకే ఓ యువ హీరోతో పాటు కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వాలని సదరు నిర్మాత భావిస్తున్నారు. వారు ఒప్పుకున్న వెంటనే షూటింగ్ ప్రారంభిస్తారని సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
ఇది చదవండి: హీరో నితిన్‌కు తప్పని ట్రాఫిక్ కష్టాలు