ETV Bharat / sitara

'నిశ్శబ్దం'గా సినిమా చూసిన పూరీ! - 'నిశబ్దం' చూసిన పూరీ జగన్నాథ్

అనుష్క నటించిన 'నిశ్శబ్దం' సినిమాను.. దర్శకుడు పూరీ జగన్నాథ్​కు చిత్రబృందం ప్రత్యేకంగా ఓ షో వేసి చూపించిందని టాక్​. తాజాగా సెన్సార్​ కార్యక్రమాలు పూర్తి చేస్తుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

'Nisabdam' movie seen by Purijagannadh
'నిశబ్దం'గా సినిమా షో చూసిన పూరీ
author img

By

Published : Jun 2, 2020, 7:34 PM IST

కరోనా లాక్‌డౌన్‌ పరిస్థితుల వల్ల రెండు నెలలుగా స్తంభించిన చిత్రసీమలో ఇప్పుడిప్పుడే సినీ సందడి మళ్లీ షురూ అవుతోంది. ఇప్పటికే ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్మాణాంతర కార్యక్రమాలు ప్రారంభం కాగా.. ఈనెలలోనే చిత్రీకరణలకు అనుమతులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే కొత్త సినిమాల సందడితో థియేటర్లు కళకళలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

థియేటర్లు తెరచుకుంటే తమ కొత్త చిత్రాలతో సందడి చేసేందుకు పలువురు దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అలా ముస్తాబై సిద్ధంగా ఉన్న సినిమాల జాబితాలో అనుష్క 'నిశ్శబ్దం' కూడా ఉంది. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. ఇటీవలే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. తాజాగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కోసం ప్రత్యేకంగా ఓ షో కూడా వేశారని సమాచారం.

హేమంత్‌కు పూరీ మంచి స్నేహితుడు. పూరీ ఎప్పటి నుంచో 'నిశ్శబ్దం' చూడాలని ఆతృతతో ఉన్నారట. అందుకే ఆయన కోసం హేమంత్‌ ప్రత్యేకంగా సినిమా ప్రదర్శించి పూరీ సలహాలు, సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లు తెరవడంపై ప్రభుత్వాల నుంచి స్పష్టత రాగానే ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించాలని చిత్రబృందం ఎదురు చూస్తోంది.

ఇదీ చూడండి : సల్మాన్​తో ఐశ్వర్య, కరీన.. ఎవరి జోడీ పాపులర్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.