నిహారిక... 'ముద్దపప్పు ఆవకాయ' వెబ్‌సిరీస్‌తో నటి, నిర్మాతగా తన ప్రయాణం ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే హైదరాబాద్‌లోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన 'యూట్యూబ్ తెలుగు డే'లో పాల్గొంది. ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
"ఓ నటిగా, నిర్మాతగా, రచయితగా నాకు ఈ వేదికపైనే గుర్తింపు లభిస్తోంది. ఇక్కడ మన సొంత నిర్ణయాలతో మనకు నచ్చినట్లు నటించొచ్చు, కథలు తయారు చేసుకోవచ్చు. ఇందులోనే సంతృప్తి ఉంది. ఆదరణ ఎక్కువే. కాలానికి అనుగుణంగా జనం మారిపోతున్నారు. సినిమాను థియేటర్లకు వెళ్లి చూసే వాళ్లు తక్కువై.. స్మార్ట్ ఫోన్లు, ఓటీటీ(నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్) వేదికల్లో సినిమా చూద్దామనుకునేవారు ఎక్కువవుతున్నారు. అందుకే ఈ రంగాన్ని ఎంచుకున్నాను. కొన్ని రోజుల వరకు లఘచిత్రాల సందడి సాగింది. ఇప్పుడంతా వెబ్‌సిరీస్‌లదే హవా. ఇందుకోసమే 'ముద్దపప్పు ఆవకాయ' అనే మొదటి వెబ్‌సిరీస్ మొదలుపెట్టాం. దక్షిణ భారతదేశంలో తొలి వెబ్‌సిరీస్ మాదే. దేశంలోనే వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న తొలి వెబ్‌సిరీస్ ఇదే. దానికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. అందుకే ఇప్పుడు 'మ్యాడ్ హౌస్' పేరుతో మరో వెబ్‌సిరీస్ చేస్తున్నాం" -నిహారిక, నిర్మాత, రచయిత, హీరోయిన్
ఇటీవలే 'సైరా నరసింహారెడ్డి'లో నటించింది నిహారిక. ప్రస్తుతం ఓ తమిళ చిత్రంలో హీరోయిన్గా చేస్తున్నట్లు చెప్పింది.
ఇది చదవండి: 'మ్యాడ్ హౌజ్' పేరుతో మెగా హీరోయిన్ వెబ్‌సిరీస్