ETV Bharat / sitara

'హరిహర వీరమల్లు'.. ఆసక్తికర విషయం చెప్పిన నిధి - హరిహర వీరమల్లు నిధిఅగర్వాల్​

Harihara veeramallu Nidhiagarwal: క్రిష్​ దర్శకత్వంలో పవన్​కల్యాణ్​ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా గురించి ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పింది హీరోయిన్​ నిధి అగర్వాల్​. ఇంతకీ అదేంటంటే..

Nidhiagarwal about harihara veeramallu
హరిహర వీరమల్లు నిధి అగర్వాల్​
author img

By

Published : Jan 13, 2022, 12:28 PM IST

Harihara veeramallu Nidhiagarwal: పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రం 'హరిహర వీరమల్లు'. నిధి అగర్వాల్‌ కథానాయిక. వరుస చిత్రాలు, కరోనా ఎఫెక్ట్‌తో పవన్‌ ఈ సినిమాకు కొంత విరామం ఇచ్చారు. ఈ క్రమంలో 'హరిహర వీరమల్లు' గురించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. తాజాగా నిధి అగర్వాల్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన మెయిన్‌ పాయింట్‌ను చెప్పేసింది.

పవన్‌కల్యాణ్‌తో నటించడం తన అదృష్టమని, ఈ సినిమా కోసం యాక్షన్‌ సన్నివేశాల్లో పాల్గొన్నానని తెలిపింది. అంతేకాదు, ఇది రెండు కాలాల మధ్య సాగే కథ అంటూ అసలు విషయాన్ని బయటపెట్టింది. అంటే పవన్‌ కల్యాణ్‌ హరిహర వీరమల్లు పాత్రతో పాటు, మరో పాత్రలోనూ సందడి చేసే అవకాశం ఉంది. ఇది పూర్తి పీరియాడికల్‌ చిత్రమే అయినా రెండు వేర్వేరు కాలాల్లో జరిగే కథ అని నిధి చెప్పిన మాటలను బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ న్యూస్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. పవన్‌ ప్రస్తుతం 'భీమ్లానాయక్‌' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది.

ఇదీ చూడండి: పవన్​ చిత్రం నుంచి జాక్వెలిన్​ ఔట్​.. ఆ భామకు ఛాన్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.