కృష్ణ జింకల వేట కేసులో వచ్చే నెల 6న జరిగే విచారణకు హాజరు కావాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ను జోధ్‌పూర్ జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఆయనను ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కింది కోర్టు తీర్పు ఇవ్వగా.. ఖాన్ దాన్ని సెషన్స్ కోర్టులో సవాలు చేశారు. దీనిపై శనివారం చేపట్టిన విచారణకు ఆయన హాజరు కాలేకపోయారు.
కరోనా పరిస్థితుల కారణంగా ఖాన్ విచారణకు హాజరు కాలేరని ఆయన తరపు న్యాయవాది నిశాంత్ బోరా మినహాయింపు కోరగా.. సెషన్స్ న్యాయమూర్తి దేవేంద్ర కచ్వాహ అందుకు అంగీకరించారు. అయితే, ఫిబ్రవరి 6న జరిగే విచారణకు హాజరు కావాలని సల్మాన్ ఖాన్‌ను ఆదేశించారు.
ఏం జరిగిందంటే?
ఓ సినిమా చిత్రీకరణ సందర్భంగా జోధ్‌పూర్ వచ్చిన సల్మాన్‌ఖాన్, మరికొందరు.. 1998, అక్టోబరు 1-2 తేదీల్లో స్థానిక కృష్ణ జింకలను వేటాడినట్టు కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన దిగువ కోర్టు, 2018 మార్చిలో తీర్పు వెలువరించింది. ఈ కేసులో సల్మాన్ దోషిగా నిర్ధారించింది.
ఇదీ చూడండి: కత్తితో కేక్ కటింగ్.. విజయ్ సేతుపతి క్షమాపణలు