ETV Bharat / sitara

పంచ్ లు కురిపించేందుకు 'గని' సిద్ధం- రిలీజ్ అప్పుడే..

author img

By

Published : Feb 15, 2022, 11:59 AM IST

Updated : Feb 15, 2022, 12:59 PM IST

Gani Movie Release: కొత్త మూవీ అప్​డేట్స్ వచ్చేశాయి. 'గని', ఆడవాళ్లు మీకు జోహార్లు, గుర్తుందా శీతాకాలం, సర్కారు వారి పాట ఇందులో ఉన్నాయి.

New Release Movies
గని

Gani Movie Release: మెగాహీరో వరుణ్​తేజ్​ కథానాయకునిగా నటిస్తున్న చిత్రం 'గని' ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు చిత్ర బృందం మంగళవారం తెలిపింది. మెగాహీరో వరుణ్​తేజ్​ ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపించారు. సయీ మంజ్రేకర్‌ కథానాయిక. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పకులు. జగపతిబాబు, సునీల్‌ శెట్టి, ఉపేంద్ర, నవీన్‌చంద్ర ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తమన్‌ సంగీతమందించారు.

New Release Movies
గని సినిమా

ఆడవాళ్లు మీకు జోహార్లు..!

Adavallu miku joharlu movie: శర్వానంద్ రష్మిక జంటగా నటిస్తున్న మూవీ 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. కిశోర్ తిరుమల డైరెక్షన్​లో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ టీజర్​ కూడా రిలీజ్ అయింది. అయితే.. షూటింగ్​ పూర్తి చేసుకున్న సందర్భంగా వెటరన్​ హీరోయిన్ రాధిక.. కొన్ని ఫొటోలను షేర్​​ చేసింది.

New Release Movies
ఆడవాళ్లు మీకు జోహార్లులో రాధిక
New Release Movies
ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా

గుర్తుందా శీతాకాలం..

సత్యదేవ్- తమన్నా జంటగా నటిస్తున్న సినిమా 'గుర్తుందా శీతాకాలం'. రొమాంటిక్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్​ దుమ్ములేపింది. పది లక్షల వ్యూస్​ను సంపాదించుకుంది. కన్నడ హిట్ 'లవ్ మాక్​టైల్'కు రీమేక్​ తీసిన ఈ సినిమాలో హీరో, అతడి మూడు ప్రేమకథల చుట్టూ తిరుగుతుంది. మేఘా ఆకాశ్, కావ్య శెట్టి ఇతరపాత్రలు పోషించారు. కాలభైరవ సంగీతమందించారు. నాగశేఖర్ దర్శకత్వం వహించారు.

New Release Movies
గుర్తుందా శీతాకాలం

సర్కారు వారి పాట..

Sarkari Vaari Paata Movie: 'సర్కారు వారి పాట' మూవీలో కళావతి సాంగ్ యూట్యూబ్​లో దూసుకుపోతోంది. తాజాగా 19 లక్షల వ్యూస్​ను సంపాదించుకుంది. 9 లక్షల లైక్​లను సొంతం చేసుకుంది.

New Release Movies
సర్కారు వారి పాట

సూపర్​స్టార్ మహేశ్​బాబు 'సర్కారు వారి పాట'లో కీర్తి సురేశ్ హీరోయిన్​గా నటించింది. తమన్ సంగీతమందించగా, పరశురామ్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. మే 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

ఇదీ చదవండి: బాలయ్యతో సినిమాకు ఆ డైరెక్టర్ ప్రయత్నం!

Last Updated : Feb 15, 2022, 12:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.