ETV Bharat / sitara

భీమ్లా నాయక్, సర్కారు వారి పాట విడుదల వాయిదా! - భీమ్లా నాయక్

టాలీవుడ్ అగ్రనటులు పనన్ కల్యాణ్, మహేశ్​ బాబు నటిస్తోన్న సినిమాల విడుదల తేదీలు వాయిదా పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాల రిలీజ్​ డేట్​పై క్లారిటీ రానుంది.

pawan, mahesh
పవన్, మహేశ్
author img

By

Published : Oct 24, 2021, 8:48 PM IST

సంక్రాంతి రేసులో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు చాలా సినిమాలు సిద్ధమవుతున్నాయి. అయితే.. అగ్రనటులు మహేశ్​ బాబు, పవన్​ కల్యాణ్ ఈ రేసు నుంచి దూరం కానున్నట్లు తెలుస్తోంది. మహేశ్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట'(sarkaru vaari paata movie release date) సినిమాను ఏప్రిల్ 28న రిలీజ్​ చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలిసింది. పవన్​ కల్యాణ్ నటిస్తోన్న 'భీమ్లా నాయక్​(Bheemla Nayak Movie Updates)' చిత్రాన్ని కూడా మరికొన్ని రోజులు ఆలస్యంగా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే రిలీజ్​ డేట్​పై క్లారిటీ ఇవ్వనుంది.

మహేశ్​ హీరోగా తెరకెక్కుతున్న 'సర్కారు వారి పాట' చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్​ హీరోయిన్​గా నటిస్తోంది. తమన్ సంగీత దర్శకుడు.

పవన్ కల్యాణ్(pawan kalyan new movie), రానా ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'భీమ్లా నాయక్'(bheemla nayak new update). మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియుమ్'​కు రీమేక్​(ayyappanum koshiyum telugu remake)గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సాగర్ చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ స్క్రీన్​ప్లే అందిస్తున్నారు.

మరోవైపు.. రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న 'ఆర్​ఆర్​ఆర్'​ చిత్రం, ప్రభాస్​ నటిస్తోన్న 'రాధే శ్యామ్' చిత్రాలే ప్రస్తుతం సంక్రాంతి రేసులో ఉన్నాయి. నాగార్జున నటిస్తోన్న 'బంగార్రాజు' కూడా సంక్రాంతి విడుదల కానుంది.

ఇదీ చదవండి:

ప్రకృతి ఒడిలో శ్రీముఖి.. హాట్​గా రకుల్​ప్రీత్​ సింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.