ETV Bharat / sitara

కొత్త భామలు.. సినిమాలే సినిమాలు - sreeleela family

ఇటీవల కాలంలో టాలీవుడ్​లోకి అడుగుపెట్టిన భామలు.. వరుసగా అవకాశాలు దక్కించుకుని దూసుకెళ్తున్నారు. ఇంతకీ ఆ ముద్దుగుమ్మలు ఎవరు? ఏయే సినిమాలు చేస్తున్నారు?

.
.
author img

By

Published : Oct 31, 2021, 8:59 AM IST

కొత్తదనానికి.. కొత్త అందాలకు ఎర్ర తివాచీ పరచి స్వాగతం పలకడంలో తెలుగు చిత్రసీమ(tollywood actress) ముందుంటుంది. ఏటా పదుల సంఖ్యలో కొత్త తారలు తెరపై మెరుస్తున్నా.. నాయికల కొరత కనిపిస్తూనే ఉంటుంది. అందుకే ఓ కొత్త సోయగం తెరపై వచ్చి వాలుతోందంటే చాలు.. దర్శక నిర్మాతల చూపంతా అటువైపు వెళ్లిపోతుంటుంది. ఏ మాత్రం ప్రతిభ ఉందనిపించినా చాలు.. జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాలు అందించే ప్రయత్నం చేస్తుంటారు. ఫలితంగానే ఇప్పుడు కుర్ర భామలు వచ్చీ రాగానే బిజీ అయిపోతున్నారు.

అందాల కృతి.. ఉద్ధృతి

'ఉప్పెన'తో(uppena movie) తెలుగు తెరపై మెరిసిన నయా సొగసరి కృతి శెట్టి(krithi shetty movies). కలల రాణిగా మారిపోయిన ఈ భామ.. స్టార్‌ హీరోల సినిమాలకు చిరునామాగా నిలుస్తోంది. చేతి నిండా చిత్రాలతో తీరిక లేకుండా గడుపుతోంది. త్వరలో నానితో కలిసి 'శ్యామ్‌ సింగరాయ్‌'(shyam singha roy release date) చిత్రంతో సందడి చేయనుంది. దీంతోపాటు నాగార్జున - నాగచైతన్యల 'బంగార్రాజు', నితిన్‌ 'మాచర్ల నియోజకవర్గం', సుధీర్‌బాబు 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమాల్లో నటిస్తోంది. వీటితో పాటు రామ్‌ హీరోగా లింగుస్వామి తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ సందడి చేస్తోంది. ఇవన్నీ వచ్చే ఏడాదే ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. త్వరలో మరో తెలుగు సినిమాతో పాటు ఓ తమిళ చిత్రం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

.
.

మీనాక్షి జోరు

'ఇచ్చట వాహనములు నిలుపరాదు' చిత్రంతో తెలుగు నాట అడుగుపెట్టిన ఉత్తరాది అందం మీనాక్షి చౌదరి(meenakshi chaudhary movies). ఇటీవల విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ ఆదరణ దక్కింది. అయితే మీనాక్షి అందం, అభినయాలకు మంచి మార్కులే పడ్డాయి. నిజానికి ఈ సినిమా విడుదలకు ముందే రవితేజ 'ఖిలాడి'(khiladi movie), అడివి శేష్‌ 'హిట్‌ 2' చిత్రాల్లో నటించే అవకాశం దక్కించుకున్న ఈ భామ.. విడుదల తర్వాత మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ఇప్పుడీ అమ్మడి పేరును.. ఇద్దరు స్టార్‌ హీరోల చిత్రాల కోసం పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి ప్రభాస్‌ నటిస్తున్న 'సలార్‌'(salaar release date) కాగా.. మరొకటి మహేష్‌బాబు - త్రివిక్రమ్‌ల కలయికలో రూపొందనున్న కొత్త సినిమా. ఈ రెండింటిలోనూ ఆమె రెండో నాయికగా కనిపించే అవకాశమున్నట్లు ప్రచారం వినిపిస్తోంది.

.
.

అందరి చూపు.. శ్రీలీల వైపు

'పెళ్లి సందడి'(pelli sandadi movie) చిత్రంతో తెలుగు తెరపై కాలుమోపిన నయా తెలుగందం శ్రీలీల(sreeleela family). రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ ఆదరణే దక్కింది. అయితే శ్రీలల నటనకు.. ఆమె డ్యాన్సులకు సినీప్రియుల నుంచి మంచి గుర్తింపు లభించింది. దీంతో ఇప్పుడీ భామకు అవకాశాలు వరుస కడుతున్నాయి. ప్రస్తుతం రవితేజతో 'ధమాకా'లో నటిస్తున్న ఈ అమ్మడు.. మరో నలుగురు కుర్ర హీరోల సినిమాలకు సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. అందులో ఓ మెగా హీరో సినిమాతో పాటు శర్వానంద్‌, నిఖిల్‌ వంటి వారి చిత్రాలున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. శ్రీలీల ప్రస్తుతం కన్నడలో 'బైటూలవ్‌' అనే ఓ సినిమా చేస్తోంది. ఇది వచ్చే ఏడాది ఉగాదికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

.
.

రయ్‌.. రయ్‌.. కేతిక

'రొమాంటిక్‌' సినిమాతో(romantic movie review) తెరంగేట్రం చేసిన దిల్లీ అందం కేతిక శర్మ(ketika sharma movies). ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి.. కేతిక గ్లామర్‌ షో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇదే ఇప్పుడు కుర్రకారును థియేటర్లకు రప్పించేలా చేస్తోంది. అందుకే తొలి చిత్రం బయటకు రాక ముందే నాగశౌర్యకు జోడీగా 'లక్ష్య'లో(lakshya movie download) నటించే అవకాశం దక్కించుకుంది. ఇటీవలే వైష్ణవ్‌ తేజ్‌ కొత్త సినిమాలోనూ ఛాన్స్‌ కొట్టేసింది. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉండగా.. 'లక్ష్య' విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగులో మరికొన్ని కథలు చర్చల దశలో ఉన్నట్లు.. ఇటీవలే ఇంటర్వ్యూలో తెలియజేసింది.

.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.