ETV Bharat / sitara

బాలకృష్ణ సరసన ఉత్తరాది కొత్త భామ! - బాలయ్య బోయపాటి చిత్రం

బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో హీరోయిన్​ ఎవరనే దానిపై ఇంకా స్పష్టత లేదు.అయితే ఇందులో బాలీవుడ్​కు చెందిన కొత్త నటిని ఎంపిక చేసే పనిలో పడిందట చిత్రబృందం.

బాలకృష్ణ సరసల ఉత్తరాది కొత్త భామ
బాలకృష్ణ సరసల ఉత్తరాది కొత్త భామ
author img

By

Published : Jul 11, 2020, 2:29 PM IST

ఎమోషనల్‌ చిత్రాలకు డైలాగ్‌లో చెప్పడంలో తెలుగు హీరోల్లో బాలకృష్ణది ప్రత్యేకమైన శైలి. ప్రస్తుతం ఆయన బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అయితే ఈ చిత్రంలో కథానాయిక ఎవరనే దానిపై ఇంత వరకు ఎలాంటి సమాచారం లేదు. ఆ మధ్య కొంతమంది బాలీవుడ్‌ భామలతోపాటు తెలుగు కథానాయికల పేర్లు కూడా వినిపించాయి. తాజాగా ఈ చిత్రంలో ముంబయికి చెందిన కొత్త నటిని ఎంపిక చేయాలని భావిస్తున్నారట.

చిత్ర దర్శకుడు బోయపాటి మాత్రం ఇందులో నూతన కథానాయికను పరిచయం చేస్తున్నట్లు గతంలోనే ఓ ప్రకటన చేశారు. అందుకు అనుగుణంగానే ఉత్తరాది మోడళ్లతో సంప్రదింపులు కూడా జరిపారట. త్వరలోనే సినిమాకు సరిగ్గా సరిపోయే ఆ కొత్తభామను ఖరారు చేయనున్నారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ను ప్రతినాయకుడిగా తీసుకోనున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే చిత్రబృందం సంజుతో కూడా సంప్రదింపులు జరిపారని, అందుకు ఆయన కూడా సానుకూలత వ్యక్తం చేశారని వార్తలొస్తున్నాయి. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తుండగా, తమన్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. కరోనా వైరస్‌ ప్రభావం తగ్గిన తరువాతే చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.