ETV Bharat / sitara

ఎంట్రీతోనే అదరగొట్టిన కొత్త దర్శకులు

ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కొత్త దర్శకులు తమ జోరు చూపించారు. తొలి సినిమాతోనే ప్రేక్షకులను బాగా అలరించారు. వారెవరు? ఏ చిత్రాలతో ముందుకొచ్చారు? లాంటి విషయాల సమాహారమే ఈ కథనం.

author img

By

Published : Dec 26, 2020, 10:19 AM IST

new directors
కొత్తదర్శకులు

మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కొత్త కథలు అల్లుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు కొత్త దర్శకులు. పడికట్టు సూత్రాలను పక్కకు నెట్టి.. మూస కథలకు చెల్లుచీటీ ఇస్తూ.. వైవిధ్యభరిత కథాంశాలతో వెండితెరపై వాళ్లు చేసే మాయాజాలం సినీప్రియుల్ని ఎప్పుడూ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతూనే ఉంటుంది. అందుకే కొత్త ప్రతిభ వెండితెరపై మెరుస్తుందంటే చాలు.. సినీప్రియులంతా ఆసక్తిగా అటు వైపు ఓ కన్నేస్తుంటారు. ఈ ఏడాది అలాంటి సరికొత్త రుచులను సినీప్రియులకు రుచి చూపించి, భేష్‌ అనిపించుకున్న నవతరం దర్శకులు చాలా మందే ఉన్నారు. వీరిలో బాక్సాఫీస్‌ ముందు సత్తా చాటిన వారు కొందరైతే.. ఓటీటీ వేదికగా మెరుపులు మెరిపించిన వారు మరికొందరు.

new directors
కొత్తదర్శకులు

కొన్నేళ్లుగా వెండితెరపై కొత్త కెప్టెన్ల జోరు పెరిగింది. ఏటా పది మంది దాకా ప్రతిభావంతులైన యువ దర్శకులు చిత్ర సీమలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. ఈ ఏడాదీ ఆ స్ఫూర్తి కొనసాగింది. జనవరి నుంచే కొత్త దర్శకులు తీసిన సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అయితే, ఫిబ్రవరిలో విడుదలైన చిత్రాలే కొత్తతరం ప్రతిభని సినీప్రియులకు రుచి చూపించాయి. ఈనెలలో విడుదలైన దుల్కర్‌ సల్మాన్‌.. 'కనులు కనులు దోచాయంటే', విష్వక్‌ సేన్‌.. 'హిట్‌' చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందాయి. అనువాద చిత్రంగా వచ్చిన 'కనులు దోచాయంటే'తో దేసింగ్‌ పెరియసామి దర్శకుడుగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఓ క్రైమ్‌ డ్రామా కథాంశాన్ని.. రొమాంటిక్‌ ప్రేమకథతో మిళితం చేసి వెండి తెరపై ఆయన కథ చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది. 'అ!'తో ప్రశాంత్‌ వర్మ వంటి ప్రతిభావంతుడైన దర్శకుడ్ని తెలుగు తెరకు పరిచయం చేశారు నాని. ఆయన నిర్మాతగా తనరెండో చిత్రం 'హిట్‌'తో శైలేష్‌ కొలను వంటి మరో కొత్త దర్శకుడ్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఓ విభిన్నమైన నేర పరిశోధనా కథాంశంతో ఆయన ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచిచ్చారు. మార్చిలో వచ్చిన 'పలాస' చిత్రంతో కరుణ కుమార్‌ అనే కొత్త దర్శకుడు తెలుగు తెరపై మెరిశారు. సమాజంలో మనుషుల మధ్య కనిపిస్తున్న అంతరాల్ని ఎత్తి చూపుతూ.. విభిన్న దారిలో ఆయన చేసిన ప్రయత్నం విమర్శకులతో పాటు, సినీ ప్రియుల ప్రశంసల్ని అందుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంతో శ్రీకాకుళం పల్లె జీవితాల్ని, వాళ్ల జీవభాషని తెరపై ఎంతో భావోద్వేగభరితంగా ఆవిష్కరించారు కరుణ కుమార్‌. ఇక ఆ నెలలో వచ్చిన 'ఓ పిట్టకథ'తో దర్శకుడిగా మంచి మార్కులు వేయించుకున్నారు చెందు ముద్దు. ఈ చిత్రం వెండి తెరపై సత్తా చాటలేకపోయినా.. ఓటీటీ వేదికపై జోరు చూపించింది.

new directors
కొత్తదర్శకులు

ఓటీటీ వేదికపై మెరుపులు

కరోనా - లాక్‌డౌన్‌ పరిస్థితులతో మార్చి మధ్య నుంచి థియేటర్లు మూతపడటం వల్ల.. తర్వాత చాలా చిత్రాలు ఓటీటీల్లో నేరుగా విడుదలయ్యాయి. వీటిలో కొత్త దర్శకుల ప్రతిభ గురించి గట్టిగా మాట్లాడుకునేలా చేసిన తొలి చిత్రం భానుమతి రామకృష్ణ. నవీన్‌ చంద్ర కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంతో దర్శకుడిగా సినీప్రియులకు పరిచయమయ్యారు శ్రీకాంత్‌ నాగోతి. వయసు ముదిరిన ఇద్దరు వ్యక్తుల ప్రేమ కథాంశానికి చిన్న చిన్న భావోద్వేగాలు మేళవించి ఓ సరికొత్త పంథాలో ఆయన కథ చెప్పిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. ప్రేమలకు కులం, మతం, డబ్బు, ప్రాంతాలు మాత్రమే అడ్డుకాదని.. అప్పుడప్పుడు రంగు కూడా అడ్డుగోడగా నిలుస్తుందని కలర్‌ఫొటోతో చూపించి మెప్పించారు దర్శకుడు సందీప్‌రాజ్‌. ఈ చిత్రంతోనే నటుడు సుహాస్‌ హీరోగా మెరిశారు. రాజకీయ నాయకులు విగ్రహాల పేరుతో చేసే రాజకీయాల వల్ల.. ప్రజల జీవితాలు ఎలా నలిగిపోతున్నాయో జోహార్‌తో చూపించారు దర్శకుడు తేజ మార్ని. ఆయన చేసిన ఈ తొలి ప్రయత్నానికి మంచి మార్కులే పడ్డాయి. మధ్యతరగతి కథలు.. గ్రామీణ నేపథ్య చిత్రాల్లోని భావోద్వేగాలు ప్రేక్షకుల్ని ఎప్పుడూ కట్టిపడేస్తూనే ఉంటాయి. మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌తో ఈ నేపథ్యాన్నే ఎంచుకుని తొలి ప్రయత్నంలోన్నే విజయ ఢంకా మోగించారు వినోద్‌ అనంతోజ్‌. కొత్త కథను, కొత్తగా కథ చెప్పే విధానాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకంతో వచ్చిన ఈ దర్శకులు మంచి ఫలితాల్నే అందుకోగలిగారు.

ఇదీ చూడండి : ఎంట్రీతో టాలీవుడ్​ కొత్త డైరక్టర్లు అదరగొడతారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.