హిందూ దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడారంటూ నటుడు విజయ్ సేతుపతిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిషేకం, అలంకరణ, కైంకర్యాలను తప్పుబడుతూ, మార్చి 17న ఓ ఛానెల్ కార్యక్రమంలో విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ అఖిల భారత హిందూ మహాసభ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
హిందూ ఆలయాల్లో ఆగమ నియమాలను అనుసరించి చేసే కైంకర్యాలను కించపరుస్తూ మాట్లాడటం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఆయన అలా మాట్లాడటానికి కారణమేంటని ప్రశ్నించింది. సొంత ప్రచారానికి హిందూ మతమే దొరికిందా? అని మండిపడింది. విజయ్ సేతుపతిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నగర పోలీసు కమిషనర్‌కు ఓ లేఖ రాసి పంపింది. మరోవైపు విజయ్ సేతుపతికి సంబంధించిన ట్రోలింగ్, మీమ్స్.. సామాజిక మాధ్యమాల్లో జోరుగా హల్‌చల్ చేస్తున్నాయి.