Anushka sharma netflix deal: బాలీవుడ్ ప్రముఖ నటి అనుష్క శర్మ.. మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్‌లో నటిస్తూ బిజీగా ఉంది. ఓ వైపు కుటుంబంతో సంతోషంగా గడుపుతున్న ఆమె.. దాదాపు మూడేళ్ల తర్వాత నటిస్తోంది. మరోవైపు నిర్మాతగానే ఆకట్టుకునే ప్రాజెక్టులు చేస్తోంది.
గత కొన్నేళ్లలో ఓటీటీ వేదికగా అనుష్క నిర్మించిన 'పాతాళ్ లోక్'(వెబ్ సిరీస్-అమెజాన్ ప్రైమ్), 'బుల్బుల్'(నెట్‌ఫ్లిక్స్) నెటిజన్లను అలరించాయి. ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో ఈమె భారీ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
దాదాపు రూ.400 కోట్ల మేరకు అనుష్కతో నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఒప్పందం చేసుకుందని సమాచారం. ఇందులో భాగంగానే అనుష్క నిర్మాణ సంస్థ.. నెట్‌ఫ్లిక్స్ కోసం సినిమాలు, సిరీస్‌లు, డాక్యుమెంటరీలు చేయనుంది. ప్రస్తుతం ఈ విషయం చర్చల్లో ఉన్నప్పటికీ, త్వరలో దీనిపై క్లారిటీ రానుంది.
Vamika photo: టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్న అనుష్క.. వామికకు జన్మనిచ్చింది. దక్షిణాఫ్రికాతో మూడో వన్డే సందర్భంగా ఆ చిన్నారి ఫొటోలు వైరల్‌గా మారాయి. అయితే వాటిని ఎవరూ ఎక్కువగా షేర్ చేయొద్దని కోహ్లీ-అనుష్క దంపతులు.. నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇవీ చదవండి:
- వామిక ఫొటో వైరల్.. స్పందించిన విరుష్క జోడీ
- 'కోహ్లీ ఆ రోజు ఇంకా గుర్తుంది'.. అనుష్క ఎమోషనల్ పోస్ట్
- మహిళా క్రికెటర్ బయోపిక్‌లో అనుష్క.. మూడేళ్ల తర్వాత రీఎంట్రీ
- 2021లో 'అమ్మ'గా మారిన బాలీవుడ్ తారలు
- వామ్మో.. కోహ్లీ, అనుష్క బాడీగార్డ్ జీతం మరీ అంతా?
- కోహ్లీ కుమార్తె 'వామిక' అంటే అర్థం ఇదే.. మరి 'జీవా' అంటే?