బాలీవుడ్ నటుడు అజయ్‌దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'చాణక్య'. నీరజ్ పాండే దర్శకత్వం వహిస్తున్నాడు. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతన్న ఈ చిత్రం.. అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని దర్శకుడు వెల్లడించాడు.
భారతీయ అర్థశాస్త్ర పితామహుడు, మౌర్యుల తొలి చక్కవర్తి చంద్రగుప్తా ముఖ్య సలహాదారుడైన 'చాణక్యుడు' పాత్రలో అజయ్ దేవగణ్ కనిపించనున్నాడు.
" సినీ ప్రియులకు చాలా ఆసక్తి, ఉత్కంఠభరితంగా ఈ చిత్రం ఉంటుందని భావిస్తున్నాను. ప్రస్తుతం ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. "
-నీరజ్, దర్శకుడు.
'ఏ వెన్స్డే', 'స్పెషల్ 26', 'బేబి', 'ఎమ్ఎస్ ధోని' వంటి చిత్రాలను తెరకెక్కించాడీ దర్శకుడు.
ఖైదీ రీమేక్..!
తమిళంలో కార్తీ హీరోగా వచ్చిన 'ఖైదీ' చిత్రాన్ని.. అజయ్ దేవగణ్ హిందీలో రీమేక్ చేయనున్నట్లు సమాచారం. కోలీవుడ్‌లో ఈ సినిమాకు లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించాడు. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోనూ కీలక పాత్ర పోషించనున్నాడీ బాలీవుడ్ స్టార్ హీరో.
ఇదీ చూడండి.. చెర్రీ తొలి ఇన్‌స్టా పోస్ట్ అమ్మకే అంకితం