నెట్ఫ్లిక్స్లో ఇటీవల విడుదలైన 'బొంబే బేగమ్స్' వివాదంలో చిక్కుకుంది. ఇందులోని కొన్ని సన్నివేశాలు బాలల హక్కులను హరించే విధంగా ఉన్నాయని కొందరు ట్వీట్లు చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ బాలల హక్కుల కమీషన్ ఛైర్మన్ ప్రియాంక మాట్లాడుతూ.. ఈ సిరీస్ను ఓటీటీ నుంచి వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఈ విషయమై సదరు సంస్థ స్పందించాల్సి ఉంది.
ముంబయిలోని వివిధ రంగాలకు చెందిన ఐదుగురు మహిళల జీవితానికి సంబంధించిన కథతో ఈ సిరీస్ను తెరకెక్కించారు. చాలాకాలం తర్వాత పూజా భట్ ఇందులో నటించారు.
ఇటీవల కాలంలో వెబ్ సిరీస్లు వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నాయి. 'తాండవ్', 'మీర్జాపుర్' కూడా ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొన్నాయి.
