డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌కు మళ్లీ సమన్లు జారీ చేసింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. ఈమెతో పాటే కెడబ్ల్యూఏఏఎన్ టాలెంట్ ఏజెన్సీకి కూడా సమన్లు పంపింది.
అక్టోబర్ 27న కరిష్మా ఇంట్లో సోదాలు నిర్వహించి, మాద్రక ద్రవ్యాలను ఎన్సీబీ స్వాధీనం చేసుకుంది. తక్షణమే విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. అయితే అప్పటికే ఆమె పరారీలో ఉండటం వల్ల మరోసారి కరిష్మాకు సమన్లను జారీ చేసింది.
అంతకముందు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, దీపికా పదుకొణె, శ్రద్ధాకపూర్లకు సమన్లు పంపి, అధికారులు విచారించారు.
ఇదీ చూడండి బాలయ్య సినిమాలో నందమూరి హీరో!