ETV Bharat / sitara

కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టిన బాలయ్య - balayya latest movies

నందమూరి బాలకృష్ణ, మాస్​ డైరెక్టర్​ బోయపాటి శ్రీను కాంబినేషన్​లో ముచ్చటగా మూడోసారి ఓ సిినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం 'రూలర్'​ చిత్రంతో బీజీగా ఉన్న బాలయ్య... నేడు కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టేశాడు.

NBK 106 movie: nandamuri balakrishna and Boyapati Srinu team up for mass entertainer
కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టిన బాలయ్య
author img

By

Published : Dec 6, 2019, 12:05 PM IST

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపవుతుంది. ఇప్పటికే వీరిద్దరు కలిసి పనిచేసిన 'సింహా', 'లెజెండ్' బాక్సాఫీస్ వద్ద బ్లాక్​బస్టర్​గా నిలిచాయి. తాజాగా ఈ జోడీ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైంది. బాలయ్య-బోయపాటిల మూడో సినిమా పూజా కార్యక్రమంతో నేడు ప్రారంభమైంది. వచ్చే ఏడాది నుంచి రెగ్యులర్​ షూటింగ్​ జరుపుకోనుంది.

NBK 106 movie: nandamuri balakrishna and Boyapati Srinu team up for mass entertainer
కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టిన బాలయ్య

ఇద్దరితో రొమాన్స్​...

యాక్షన్​ ఎంటర్​టైనర్​గా తెరకెక్కనున్న ఈ మూడో చిత్రంలో ఇద్దరు కథానాయికలు ఉంటారని సమాచారం. వారిలో ఒక హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ శ్రద్ధ శ్రీనాథ్‌ తీసుకునే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నాడని తెలుస్తోంది.

తమన్ సంగీతం...
ప్రస్తుతం తెలుగు సినిమాల్లో తమన్ హవా నడుస్తోంది. వరుస చిత్రాలతో జోరుమీదున్నాడు. తాజాగా బాలయ్య-బోయపాటి సినిమాకు సంగీతం అందించనున్నాడు. మిర్యాల రవీందర్​ రెడ్డి నిర్మాత. నటీనటులు, సాంకేతిక విభాగం వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

ప్రస్తుతం కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కిన 'రూలర్​'... ఈనెల 20న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అత్యంత భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. డిసెంబర్ 15న వైజాగ్‌లో ఈ వేడుక జరగనుంది.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.