Nayanthara the lipbalm company: స్టార్ హీరోయిన్ నయనతార అభిమానులకు కొత్త న్యూస్. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ.. కొత్తగా ఓ వ్యాపారంలో అడుగుపెట్టింది. 'ది లిప్‌బామ్ కంపెనీ' పేరుతో ఓ బ్యూటీ రిటైల్ బ్రాండ్‌ను ప్రారంభించింది.చర్మవ్యాధి నిపుణురాలు రేణిత రాజన్‌తో కలిసి ఈ బ్రాండ్‌ను ఆవిష్కరించింది.
గతేడాదే ఈ బిజినెస్ మొదలుపెట్టాలని అనుకున్నప్పటికీ కరోనా లాక్డౌన్ వల్ల అది కాస్త ఆలస్యమైంది. ఫలితంగా ఇప్పటికీ సమయం కుదిరింది అని రాజన్ చెప్పారు.
నయనతార.. తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను త్వరలో పెళ్లి చేసుకుంది. ఇప్పటికే వీరిద్దరికి నిశ్చితార్థం అయింది! ఇది ఇలా ఉన్నప్పటికీ స్టార్ హీరోలు రజనీకాంత్, చిరంజీవిలతో సినిమాలు చేస్తోంది. అలానే కుర్రహీరోల చిత్రాల్లోనూ నటిస్తోంది.
ప్రస్తుతం నయనతార 'కాతువక్కుల రెండు కాదల్' , చిరు 'గాడ్‌ఫాదర్', 'కనెక్ట్', 'గోల్డ్' సినిమాలతో పాటు హిందీలో షారుక్ కొత్త చిత్రంలోనూ హీరోయిన్గా చేస్తోంది.
ఇవీ చదవండి: