ETV Bharat / sitara

'లూసిఫర్' కథలో మార్పు.. కీలకపాత్రలో నయన్​! - చిరంజీవి వార్తలు

'లూసిఫర్​' తెలుగు రీమేక్​లో మెగాస్టార్​ చిరంజీవి నటించనున్నారు. అయితే ఈ స్క్రిప్టులో కొంత మార్పు చేసి సినిమాను రూపొందించనున్నట్లు సమాచారం. మాతృకలో ఇద్దరు కథానాయకులు ఉండగా.. ఇందులో మాత్రం కేవలం చిరు పాత్రతోనే తెరకెక్కించనున్నారని ప్రచారం జరుగుతోంది.

Nayanthara to join Chiranjeevi in Lucifer Telugu remake
'లూసిఫర్' కథలో మార్పు.. కీలకపాత్రలో నయన్​!
author img

By

Published : Jan 17, 2021, 6:35 AM IST

మెగాస్టార్​ చిరంజీవి కథానాయకుడిగా త్వరలోనే పట్టాలెక్కనున్న సినిమాల్లో 'లూసిఫర్‌' రీమేక్‌ ఒకటి. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తారు. మోహన్‌లాల్‌, పృథ్వీరాజ్‌ కలిసి నటించిన ఆ చిత్రం మలయాళంలో ఘనవిజయం సాధించింది. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాని చూసి, ఎంతో ముచ్చటపడి రీమేక్‌ హక్కుల్ని సొంతం చేసుకున్నారు రామ్‌చరణ్‌. ఇప్పుడు తెలుగులో పలు మార్పులు, చేర్పులతో తెరకెక్కించేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది.

కథానాయకుడిగా చిరంజీవి ఒక్కరే ఇందులో నటిస్తారని, మలయాళం సినిమాలాగా మరో కథానాయకుడి పాత్ర అవసరం లేకుండా కథలో మార్పులు చేశారని సమాచారం. నయనతార ఇందులో కీలక పాత్ర పోషించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 21న హైదరాబాద్‌లో లాంఛనంగా చిత్రాన్ని ప్రారంభించనున్నారు.

ఇదీ చూడండి: ఆ విషయంలో కత్రినా, దీపిక సూపర్: కియారా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.