ETV Bharat / sitara

రకుల్, నయనతార.. ఆ సినిమాల్లో నటించనున్నారా? - andhadhun remake

తెలుగులో తీయబోయే రెండు సినిమాల్లోని ప్రధాన పాత్రల కోసం రకుల్ ప్రీత్, నయనతారలను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

రకుల్, నయనతార.. ఆ సినిమాల్లో నటించనున్నారా?
రకుల్, నయనతార
author img

By

Published : Aug 10, 2020, 6:52 AM IST

ఏ సినిమాలో ఎవరు నటిస్తారు? ఏ పాత్ర ఎవరి సొంతం అవుతుందనేది ఆయా నటులు కెమెరా ముందుకొచ్చేవరకూ ఖరారు కాదు. కానీ ఈలోపు పలువురి పేర్లు ప్రచారంలో ఉంటాయి. అలా ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో కొద్దిమంది నటుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి... నయనతార, మరొకటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌. హిందీలో విజయవంతమైన 'అంధాదున్‌'ను నితిన్‌ హీరోగా రీమేక్‌ చేస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మధ్య వయస్కురాలి పాత్ర ఉంటుంది. దాని కోసం నయనతారను సంప్రదించారని తెలిసింది. మరి ఆమె ఒప్పుకుంటారా లేదా అన్నది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

nayanthara for andhadhun remake
నటి నయనతార

తెలుగులో తీయబోతున్న ఓ బయోపిక్‌ విషయంలో రకుల్‌ప్రీత్‌ పేరు వినిపిస్తోంది. ఫిట్‌నెస్‌కు పెట్టింది పేరైన రకుల్‌.. ఆ బయోపిక్‌లో నటించే అవకాశాలున్నాయని, ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రచారం సాగుతోంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో చిత్ర పరిశ్రమ వ్యవహారాలన్నీ నిదానంగా సాగుతున్నాయి. చిత్రీకరణలు ఊపందుకుంటే మాత్రం నటీనటుల విషయంలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

rakul for karnam malleswari biopic
నటి రకుల్ ప్రీత్ సింగ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.