ETV Bharat / sitara

'అమ్మోరు తల్లి' నయనతార.. సామాన్యుడి చెంతకొస్తే? - నయన్ విఘ్నేశ్ శివన్

నయనతార 'అమ్మోరు తల్లి' ట్రైలర్ అలరిస్తోంది. దీపావళి కానుకగా నవంబరు 14న ప్రేక్షకులు ముందుకు రానుందీ సినిమా.

nayanthara ammoru thalli telugu trailer
నయనతార 'అమ్మోరు తల్లి' ట్రైలర్
author img

By

Published : Oct 25, 2020, 4:34 PM IST

స్టార్ హీరోయిన్ నయనతార కొత్త సినిమా 'అమ్మోరు తల్లి'. తెలుగు ట్రైలర్​ను దసరా కానుకగా, సూపర్​స్టార్ మహేశ్​బాబు ఆదివారం విడుదల చేశారు. అమ్మోరు వేషధారణలో ఆకట్టుకున్న నయన్.. చిత్రంపై అంచనాల్ని పెంచుతోంది.

తమ కష్టాలను తీర్చమని ఓ కుటుంబం తమ కులదైవమైన మూడు పుడకల అమ్మవారిని ప్రార్థించడానికి వెళ్తే, నిజంగా ప్రత్యక్షమైన అమ్మవారు వారికి ఎలాంటి వరాలు ఇచ్చింది? ఆ తర్వాత ఆ కుటుంబం ఎలా మారిపోయింది? అసలు అమ్మవారు ఎందుకు ఈ భూమ్మీదకు వచ్చారు?నిజంగా ఆమె అమ్మవారేనా? తెలియాలంటే ‘అమ్మోరు తల్లి’ సినిమా చూడాల్సిందే. ‘మీ శక్తితో ఆన్‌లైన్‌ క్లాస్‌ను క్యాన్సిల్‌ చేస్తారా’ అంటూ అమ్మవారి పాత్ర పోషించిన నయనతారను అడగ్గా, ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న సన్నివేశం నవ్వులు పంచుతోంది.

ఈ సినిమాలో ఆర్​జే బాలాజీ నటించి, దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో నవంబరు 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.