Surya new movie: తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న కొత్త సినిమా 'ఈటీ' (ఎతర్క్కుమ్ తునిందవన్). ఈ సినిమాను తెలుగు, తమిళం సహా ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రంలోని 'సుమ్మ సురున్ను' లిరికల్ వీడియో సాంగ్ విడుదలై ఆకట్టుకుంటుంది. కాగా, ఈ చిత్రంలో సూర్యకి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. వినయ్‌రామ్, సత్యరాజ్, జయప్రకాశ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నవ్వులే నవ్వులు
Naveen polishetty new movie name: 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతిరత్నాలు' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి. ఆయన కథానాయకుడిగా కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 'అనగనగా ఒక రాజు' అంటూ విడుదల చేసిన ఈ వీడియోలో నవీన్ హంగామా నవ్వులు పంచుతోంది. 'నేను చెప్పకూడదు కానీ, ఈ దశాబ్దంలో అలరించే కార్యక్రమం ఇదే. థియేటర్లలో మీరే చూస్తారుగా' అంటూ నవీన్ పలికిన సంభాషణలు అలరిస్తున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అనసూయ చిత్రానికి అనూప్ స్వరాలు
వ్యాఖ్యాతగా, నటిగా వైవిధ్యమైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది అనసూయ. జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ విభిన్న కథా చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంగీతం అందించే బాధ్యతను అనూప్ రూబెన్స్ తీసుకున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. ఆర్వీ సినిమాస్ పతాకంపై ఆర్వీరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. హెబ్బా పటేల్, సాయికుమార్, అతుల్ కులకర్ణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వినసొంపైన పాటలతో శ్రోతలను అలరిస్తున్న అనూప్ రూబెన్స్ తమ చిత్రానికి పనిచేయడం అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అనసూయ ఇందులో ఎయిర్‌హోస్టెస్ పాత్రలో కనిపించనుంది. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. త్వరలోనే టైటిల్, ఇతర వివరాలను వెల్లడించనున్నారు.
ఇదీ చూడండి: hero movie: 'హీరో'ను చూసి ఆ రోజులను గుర్తుచేసుకున్న కృష్ణ!