Radhe shyam pre release event pass: 'రాధేశ్యామ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అంతా సిద్ధమైంది. ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీలో గురువారం సాయంత్రం ఈ వేడుక జరగనుంది. ఈ సందర్భంగా బుధవారం ట్వీట్ చేసిన నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్.. ఎంట్రీ పాస్‌ల గురించి స్పష్టతనిచ్చింది.
ఈ ఈవెంట్‌కు వచ్చే డార్లింగ్ ప్రభాస్ అభిమానులందరికీ ఎంట్రీ పాస్‌లు ఉచితంగానే ఇస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది. వాటిని కొనుగోలు చేయొద్దని వెల్లడించింది.

'రాధేశ్యామ్' అన్ని భాషల ట్రైలర్‌ను అభిమానులతో ఈ కార్యక్రమంలో రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఇంతకుముందే చెప్పింది.
Radhe shyam naveen polishetty: అలానే 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ', 'జాతిరత్నాలు' సినిమాల్లో హీరోగా నటించి, ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నవీన్ పోలిశెట్టి.. 'రాధేశ్యామ్' ప్రీ రిలీజ్ వేడుకకు హోస్ట్‌గా చేయనున్నాడట. ఈ హీరో యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నారు.

1970ల నాటి ప్రేమకథతో తెరకెక్కిన 'రాధేశ్యామ్'.. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే వచ్చిన పాటలు, పోస్టర్లు.. సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. ఇందులో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్గా నటించింది. కృష్ణంరాజు కీలకపాత్రలో నటించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.

ఇవీ చదవండి: