జాతీయ అవార్డు విజేత, కన్నడ నటుడు సంచారి విజయ్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరగ్గా, ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని తేల్చారు డాక్టర్లు. కోలుకునే అవకాశం చాలా తక్కువ అని తెలిపారు.
కన్నడలో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. 'నాన్ అవనల్లా అవలు' సినిమాతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు.