ETV Bharat / sitara

శివరాత్రి అప్​డేట్స్: సీరియస్​గా రవితేజ.. కూల్​గా వెంకీ

author img

By

Published : Mar 11, 2021, 10:46 AM IST

మహా శివరాత్రి పురస్కరించుకుని పండగ శుభాకాంక్షలు తెలుపుతూ తమ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్లను విడుదల చేశాయి ఆయా చిత్రబృందాలు. ఇందులో వెంకటేశ్ 'నారప్ప', రవితేజ 'ఖిలాడి' సహా పలు చిత్ర విశేషాలు ఉన్నాయి.

venky
వెంకటేశ్

విక్టరీ వెంకటేశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'నారప్ప'. తాజాగా మహా శివరాత్రిని పురస్కరించుకున ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్​ను విడుదల చేశారు. ఇందులో వెంకీ.. కూల్ అండ్ యంగ్​ లుక్​లో కనిపించారు. ఈ చిత్రం 1980కి ముందు జరిగే కథే. ఇదొక కొత్త రకమైన నేపథ్యాన్ని ఆవిష్కరించబోతోంది. ఈ మూవీకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు మూవీపై ఆసక్తిని పెంచుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 14న థియేటర్లలోకి వస్తోందీ చిత్రం.

Narappa Khiladi movie new posters
నారప్ప

మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ 'ఖిలాడి' సినిమా పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో తుపాకి పట్టుకుని సీరియస్​ లుక్​లో ఉన్న హీరో రవితేజ లుక్​ అదిరిపోయింది. 'వీర' చిత్రం తర్వాత రమేష్‌ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమా ఇది. ఏ స్టూడియోస్‌ పతాకంపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు.

Narappa Khiladi movie new posters
ఖిలాడి

విజయ్​ కిరణ్​ దర్శకత్వం వహించిన 'పైసా పరమాత్మ' సినిమాలోని టైటిల్ సాంగ్ విడుదలైంది. శ్రోతలను ఆకట్టుకునేలా ఉందీ గితం. యాక్షన్​ థ్రిల్లర్​గా రూపొందిన ఈ సినిమాలో సాంకేత్, సుధీర్​, కృష్ణ తేజ్​, జబర్దస్త్​ అవినాష్​, దీవెన, రమణ, అనూష, అరోహి నాయుడు, బనీష్​ ప్రధాన పాత్రలు పోషించారు. మార్చి 12న విడుదల కానుందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
Narappa Khiladi movie new posters
చేరువైన దూరమైన
Narappa Khiladi movie new posters
చిల్​ బ్రో
Narappa Khiladi movie new posters
రోనా
Narappa Khiladi movie new posters
కోతి కొమ్మచ్చి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.