ETV Bharat / sitara

నేచురల్ స్టార్ సినిమాలో రోహిత్ నారా? - శ్యామ్ సింగరాయ్​లో నారా రోహిత్

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. ఈ సినిమాలో రోహిత్ నారా కీలక పాత్ర పోషించబోతున్నారని సమాచారం.

Nara Rohit to play guest role in Nani shyam singha roy
నేచురల్ స్టార్ సినిమాలో రోహిత్ నారా?
author img

By

Published : Nov 3, 2020, 1:00 PM IST

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు యువ కథానాయకుడు నాని. తొలి చిత్రం 'టాక్సీవాలా'తోనే మంచి పేరు తెచ్చుకున్నారు రాహుల్‌ సంకృత్యాన్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు 'శ్యామ్‌ సింగరాయ్‌'. డిసెంబరు నుంచి సెట్స్‌పైకి వెళ్లే ఈ చిత్రంలో ఓ యువ హీరో కూడా నటించబోతున్నట్లు టాలీవుడ్‌ టాక్‌.

కథలో కీలకమైన ఆ పాత్ర కోసం నారా రోహిత్‌ అయితే ఎలా ఉంటారని చిత్ర బృందం భావిస్తోందట. ఈ క్యారెక్టర్‌కి రోహిత్‌ మాత్రమే న్యాయం చేయగలరనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమా మరింత ఆసక్తికరం కాబోతోంది. గతంలో రోహిత్‌, నాగశౌర్య కథానాయకులుగా శ్రీనివాస్‌ అవసరాల తెరకెక్కించిన 'జో అచ్యుతానంద' చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు నాని. మరిప్పుడు నారా రోహిత్‌ ఈ చిత్రంలో నటిస్తారా? లేదా తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.

'శ్యామ్‌ సింగరాయ్‌' చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి ఆడిపాడబోతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.