కరోనా కారణంగా చిత్రీకరణలు, సినిమా విడుదలలు వాయిదా పడ్డాయి. దీంతో నిర్మాతలు నష్టాల బారిన పడుతున్నారు. కొంత మంది ఓటీటీల వైపు మొగ్గు చూపుతుండగా.. మరికొందరు మాత్రం థియేటర్లలోనే విడుదల చేస్తామని అంటున్నారు. నాని కెరీర్లో 25వ చిత్రంగా ప్రత్యేకంగా నిలిచిపోయే 'వి' సినిమాను కూడా థియేటర్లలోనే విడుదల చేస్తామని చాలాసార్లు స్పష్టం చేసింది చిత్రబృందం. అయితే వారి ప్రణాళికలు అన్నీ తారుమారయ్యాయి. దీంతో ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశాడు నాని. సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించాడు.
-
V is coming home ❤️
— Nani (@NameisNani) August 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
September 5th.. The Hunt is On!@PrimeVideoIN #VOnPrime pic.twitter.com/28Lpb21RuE
">V is coming home ❤️
— Nani (@NameisNani) August 20, 2020
September 5th.. The Hunt is On!@PrimeVideoIN #VOnPrime pic.twitter.com/28Lpb21RuEV is coming home ❤️
— Nani (@NameisNani) August 20, 2020
September 5th.. The Hunt is On!@PrimeVideoIN #VOnPrime pic.twitter.com/28Lpb21RuE
ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కావాల్సిన 'వి'.. లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న కారణంగా థియేటర్లను ఇప్పట్లో తెరిచేలా కనిపించడం లేదు. అందుకే చిత్రబృందం ఓటీటీ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో నాని ప్రతినాయకుడిగా కనిపించనుండగా, సుధీర్‌బాబు పోలీస్‌గా అలరించనున్నాడు. నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ హీరోయిన్లు. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. దిల్‌రాజు నిర్మాత.